ఇక జింగిలాలో : జియో ఫైబర్‌ వచ్చేసింది

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 12:22 PM IST
ఇక జింగిలాలో : జియో ఫైబర్‌ వచ్చేసింది

రిలయెన్స్ జియో ఫైబర్‌ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 05 నుంచి లాంచ్ చేస్తామని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో గిగా ఫైబర్ సర్వీసును Jio Fiberగా మార్చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ సెప్టెంబర్ 5న ఫైబర్ సర్వీసును కమర్షియల్ లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జియో వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించేసింది. 1600 పట్టణాలు,125 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది. 

జియో ఫైబర్ కనెక్షన్ కోసం దరఖాస్తు : 
> రిలయెన్స్ జియో ఫైబర్ ‌లింక్‌ క్లిక్ చేయాలి. కనెక్షన్ యాక్సెస్ చేయాల్సిన చోట చిరునామా పొందుపర్చాలి.
> పేరు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ చెప్పాలి.
> అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ OTP వస్తుంది. దానిని సంబంధింత బాక్స్‌లో ఎంటర్ చేయాలి. జియో సేల్స్ ప్రతినిధికి జియో ఫైబర్ కనెక్షన్ పొందడానికి అవసరమైన పత్రాలు సమర్పించాలి.

> అంటే..ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒకటి ఇవ్వాలి.

జియో ఫైబర్ సేవలు ఇతర టెలికాం రంగంలో ఉన్న సంస్థలకు షాక్ తెప్పిస్తున్నాయి. ఆఫర్స్‌తో కస్టమర్లు దూరమయ్య ఛాన్స్ ఉందని భావిస్తున్నాయి. ఇతర సెటాప్ బాక్స్‌లను పోలిస్తే.. జియో బాక్స్ డిఫరెంట్. ఎయిర్ టెల్, టాటా స్కై అందించే సెటప్ టాప్ బాక్సుల కంటే మెరుగ్గా ఉందనే టాక్ వినిపిస్తోంది. జియో బాక్స్ లో ఆల్ ఇన్ వన్ ఎంటర్ టైన్ మెంట్ కన్సోల్ ఆప్షన్ ఉంది. జియో గిగాఫైబర్ సర్వీసు తీసుకున్న వినియోగదారులు బ్రాడ్ బ్యాండ్, టెలిఫోన్ కాల్స్, టీవీ సర్వీసులకు వేర్వేరుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 

జియో ఫైబర్ ప్లాన్స్ రూ. 700 నుంచి రూ. 10 వేల మధ్య ఉన్నాయి. రూ.700 ప్లాన్ తీసుకుంటే 100 MBPC స్పీడ్‌తో డేటా ఉంటుంది. జియో గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వారికి ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి డేటా స్పీడ్ ఉంటుంది. ల్యాండ్ లైన్ ఫోన్, జియో 4కె సెటాప్ బాక్స్ ఉచితం. జియో ఫరెవర్ యూన్యువల్ ప్లాన్ పేరిట ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లోనే చూసుకునే ఛాన్స్ కల్పించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో పేరిట సర్వీస్ అందించనుంది. జియో ఫైబర్ సేవలు పొందాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://gigafiber.jio.com/registration