eSIM Transfer to iPhone : మీ పాత ఐఫోన్ నుంచి eSIM కొత్త ఐఫోన్‌కు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
eSIM Transfer to iPhone : కొత్త ఐఫోన్ తీసుకున్నారా? పాత ఐఫోన్లో eSIM ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసా? సరికొత్త ఐఫోన్‌కు మీ మొత్తం డేటాను కాపీ చేసి పంపుకోవాల్సి ఉంటుంది. అందుకోసం.. మీ కొత్త ఐఫోన్‌ను సెటప్ చేసుకోవాలి.

eSIM Transfer to iPhone _ How to transfer eSIM from one iPhone to another_ A step-by-step guide
eSIM Transfer to iPhone : కొత్త ఐఫోన్ తీసుకున్నారా? పాత ఐఫోన్లో eSIM ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసా? సరికొత్త ఐఫోన్‌కు మీ మొత్తం డేటాను కాపీ చేసి పంపుకోవాల్సి ఉంటుంది. అందుకోసం.. మీ కొత్త ఐఫోన్‌ను సెటప్ చేసుకోవాలి. మీ eSIMని మీ పాత iPhone నుంచి కొత్తదానికి ట్రాన్స్ఫర్ చేసేందుకు ఇది సమయమని చెప్పవచ్చు.
తద్వారా మీరు చివరకు మీ నంబర్ని ఉపయోగించవచ్చు. మీ కొత్త ఫోన్లో ఇప్పుడు, eSIMని ట్రాన్స్ఫర్ చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. పాత iPhone నుంచి కొత్తదానికి 4 గంటలలోపు eSIMని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. మీ పాత, కొత్త iPhoneలు రెండూ iOS 16 లేదా తర్వాతి వెర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత, ఈ కింది విధంగా ప్రయత్నంచండి.
eSIMని మాన్యువల్‌గా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే? :
Settings > Mobile Data > Mobile Services సెటప్ చేయండి. మీ పాత iPhoneలో మీరు ఉపయోగించే అన్ని మొబైల్ నంబర్లు కనిపిస్తాయి. e-సిమ్ లేదా ఫిజికల్ సిమ్.. మీ టెలికాం ఆపరేటర్ ఆటోమేటిక్ eSIM ట్రాన్స్ఫర్ సపోర్టు ఇవ్వకపోతే.. మీ నంబర్‌కి దిగువన ‘ట్రాన్స్ఫర్ సపోర్టు లేదు’ అని ఉంటుంది. మీ టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించి అవసరమైన మెసేజ్ పంపాలి.
ఉదాహరణకు, మీరు జియో e-సిమ్‌ని ఉపయోగిస్తుంటే.. మీరు My Jio యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఈ-మెయిల్ IDని ధృవీకరించాలి. ఆపై GETESIMకు 199 అని టెక్స్ట్‌ని పంపాలి. Airtel యూజర్లు అయితే ‘eSIM121కి ఈ Text పంపండి. అలాగే, Vodafone Idea కోసం eSIM199 అని ఈ టెక్స్ట్‌ని పంపండి.. పూర్తయిన తర్వాత మీ eSIM ట్రాన్స్ఫర్ ప్రక్రియలో ఉందని మీకు కన్మరేషన్ ద్వారా ఈ-మెయిల్ వస్తుంది.

eSIM Transfer to iPhone _ How to transfer eSIM from one iPhone to another
eSIMని ఆటోమాటిక్‌గా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే? :
మీ eSIMని ట్రాన్స్ఫర్ చేయడానికి మరో రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి.. మీకు సమీపంలో ఉన్న iPhone నుంచి ట్రాన్స్ఫర్’ ఆప్షన్ ద్వారా మరొకటి ‘QR కోడ్’ని ఉపయోగిస్తోంది. ఇందుకోసం Settings > Mobile Data > Mobile Services సెటప్ చేయండి. మీ స్క్రీన్ దిగువ నుంచి ‘More Options‘ Tap చేయండి. మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘Transfer from nearby iPhone‘ ఆ తర్వాత ‘QR Code‘ ఎంచుకోవాలి.
మీరు ‘Nearby iPhone నుంచి డేటా ట్రాన్స్ఫర్’ ఆప్షన్ ఎంచుకుంటే.. మీ పాత iPhoneలో నోటిఫికేషన్‌ను అందుకోవచ్చు. ఆపై Continue నొక్కండి. మీ కొత్త iPhoneలో పొందిన వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. పూర్తయిన తర్వాత, మీ eSIM ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు QR కోడ్ ఆప్షన్ ఎంచుకుంటే.. మీ టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేసి QR Code తీసుకోవచ్చు.
కెమెరా యాప్‌ని ఉపయోగించి కోడ్‌ని స్కాన్ చేయండి. సెల్యులార్ ప్లాన్ డిటెక్టెడ్ నోటిఫికేషన్ కనిపించినప్పుడు దానిపై Tap చేయండి. ఆపై మీ స్క్రీన్ దిగువన Continue ఆప్షన్ Tap చేయండి. మీ డేటా ప్లాన్‌ని యాడ్ చేయండి. మీ పాత iPhone నుంచి మీ eSIMని మీ కొత్తదానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీ టెలికాం ఆపరేటర్ అందించే eSIM ట్రాన్స్ఫర్ సపోర్టు టైప్ బట్టి ఈ పద్ధతుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది.