Facebook Ceo: ఫేస్‌బుక్‌కు త్వరలో జుకర్ బర్గ్ రాజీనామా.. నిజమెంత??

కొంతకాలంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, విమర్శలతో ఫేస్‌బుక్ ఫౌండర్, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్ బర్గ్.. సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా బ్రిటన్ మీడియాలో ఊహాగానాలు జోరందుక

Facebook Ceo: ఫేస్‌బుక్‌కు త్వరలో జుకర్ బర్గ్ రాజీనామా.. నిజమెంత??

Facebook Ceo: కొంతకాలంగా ఎదురవుతున్న ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, విమర్శలతో ఫేస్‌బుక్ ఫౌండర్, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్ బర్గ్.. సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా బ్రిటన్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. అవన్నీ నిజమైతే.. మరో 2, 3 వారాల్లోనే ఫేస్ బుక్ కు జుకర్ బర్గ్.. టాటా చెప్పేసే అవకాశం ఉందనే రూమర్లు జోరందుకున్నాయి.

రీసెంట్ గా.. ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో జుకర్ బర్గ్ చేసిన కామెంట్లే ఈ రూమర్లకు కారణం. భవిష్యత్తులో సీఈవోగా ఉన్నా లేకున్నా.. ఫేస్ బుక్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత సిబ్బంది అందరిదని జుకర్‌బర్గ్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సంస్థకు చెందిన ఓ సీనియర్ ఉద్యోగి ఈ విషయాన్ని బయటకు చెప్పినట్టు అక్కడి మీడియా తెలిపింది.

అయితే.. ఈ విషయంపై జుకర్ బర్గ్ మనసులో ఉన్నదేంటి.. ఆయన మున్ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.. ఫేస్ బుక్ ను ఈ స్థాయికి తీసుకువచ్చిన ఆయన.. ఈ సమస్యలకే బాధ్యతల నుంచి తప్పుకొంటారా.. వేరే కారణాలతో తప్పుకుంటున్నారా.. నిజంగానే ఆయన సైడ్ అయిపోతే తర్వాత బాస్ ఎవరు.. అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదు.

…………………………………………….: భారీ వర్షాలకు.. కేరళ విలవిల.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్లు, చెట్లు..!

యూజర్ల డేటా లీకేజి విషయంలో ఫేస్‌బుక్ కొన్నేళ్లుగా విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌తో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ఆ సంస్థ మాజీ కీలక ఉద్యోగిని సంచలన ఆరోపణలు చేస్తోంది. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ఎక్కువయ్యాయని విమర్శిస్తోంది. ఈ నేపధ్యంలో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలనే ఉద్యమం కుడా ప్రారంభమైంది.

ఈ విషయంపై.. సంస్థ నుంచి స్పష్టమైన సమాచారం వస్తే తప్ప.. రూమర్లు ఆగేలా లేవు. నవంబర్ 10వ తేదీన క్విట్ ఫేస్‌బుక్ పేరుతో ఆ ఒక్కరోజు ఫేస్‌బుక్, అనుబంధ యాప్‌లు వాడవద్దంటూ క్యాంపెయిన్ నడుస్తోంది.