టెక్ సూపర్ స్టార్ కు 35 ఏళ్లు : హ్యాపీ బర్త్ డే జుకర్ బర్గ్

మే 14, 2019. ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజు సోషల్ మీడియా సూపర్ స్టార్, ఇంటర్నెట్ ఐకాన్, ఫేస్ బుక్, వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పుట్టినరోజు.

  • Published By: sreehari ,Published On : May 14, 2019 / 01:41 PM IST
టెక్ సూపర్ స్టార్ కు 35 ఏళ్లు : హ్యాపీ బర్త్ డే జుకర్ బర్గ్

మే 14, 2019. ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజు సోషల్ మీడియా సూపర్ స్టార్, ఇంటర్నెట్ ఐకాన్, ఫేస్ బుక్, వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పుట్టినరోజు.

మే 14, 2019. ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజు సోషల్ మీడియా సూపర్ స్టార్, ఇంటర్నెట్ ఐకాన్, ఫేస్ బుక్, వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పుట్టినరోజు. ప్రపంచ అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజంగా ఎదిగిన ఫేస్ బుక్ సంస్థను సీఈఓ హోదాలో ముందుకు నడిపిస్తున్నాడు.. జుకర్ బర్గ్. ఈ రోజు ఆయన 35ఏళ్లలోకి అడుగుపెట్టారు. జుకర్ బర్గ్ పూర్తి పేరు.. మార్క్ ఇల్లియట్ జుకర్ బర్గ్. మే 14, 1984లో జన్మించాడు. ఇతర పిల్లల్లానే ఈయన కూడా డాక్టర్ల కుటుంబంలో జన్మించాడు. జుకర్ బర్గ్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే. చిన్నప్పటి నుంచి జుకర్ బర్గ్ కు టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. 12ఏళ్ల వయస్సులోనే అద్భుతమైన ప్రొగ్రామ్ డెవలప్ చేశాడు. 

12ఏళ్లకే మెసేంజర్ ప్రొగ్రామ్ : 
అప్పట్లోనే బేసిక్ మెసేంజర్ ‘జుక్ నెట్’ను డిజైన్ చేశాడు. ఈ మెసేంజర్ ద్వారా ఇంట్లోని కంప్యూటర్లకు కనెక్ట్ చేసేవాడు. తండ్రి దంత వైద్యుడు కావడంతో వైద్యసేవలకు మెసేంజర్ తో సేవలందించేవాడు. టెక్నాలజీ పట్ల తనకున్న ఆసక్తి.. హైస్కూల్ నుంచి కాలేజీ వరకు కొనసాగింది. కాలేజీ జీవితంలోనే తన ఫస్ట్ అధికారిక ప్రొగ్రామ్ ‘కోర్సు మ్యాచ్’ను డెవలప్ చేశాడు. 2002లో స్టాన్ ఫోర్డ్ లో సెకండ్ ఈయర్ చదువుతున్న సమయంలో ఈ  ప్రొగ్రామ్ ను రూపొందించాడు. 

బర్గ్ సొంత ఐడియా.. 2004లో ఫేస్ బుక్ లాంచ్ :
ఈ ప్రొగ్రామ్.. కోర్సులకు సంబంధించి లిస్టులోని తమ సబ్జెక్టులను ఒక విద్యార్థి నుంచి మరొక విద్యార్థి ఎంచుకునేందుకు ఎంతో ఉపయోగపడింది. చివరికి 2003లో ‘ఫేస్ మాష్’ అనే జోక్ ప్రొగ్రామ్ ను రూపొందించాడు. స్టాన్ ఫోర్డ్ లో మరో విద్యార్థి దివ్య నరేంద్ర, అతని పార్టనర్లు ట్విన్స్ టైలర్, కెమెరాన్ వింక్ లెవొస్.. జుకర్ బర్గ్ తో కలిసి సోషల్ నెట్ వర్క్ స్థాపించే విషయమై చర్చించారు. హర్వార్డ్ కనెక్షన్ తో జుకర్ బర్గ్ సొంత ఆలోచనతో సోషల్ నెట్ వర్క్ కు పునాది పడింది. అప్పుడే ఫేస్ బుక్ పుట్టింది. ఫిబ్రవరి 2004లో సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం ఫేస్ బుక్ ను లాంచ్ చేశారు. 2012లో ఫేస్ బుక్ ను పబ్లిక్ లో తెచ్చారు. 2015 నాటికి ఫేస్ బుక్ ను పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవడంలో జుకర్ బర్గ్ సంస్థ వ్యవస్థాపకుడిగా కీలక పాత్ర పోషించాడు. 

జుకర్.. జీతం 1 డాలర్ మాత్రమే : 
ఫేస్ బుక్ అనగానే.. యూజర్ల అందరికి ముందుగా గుర్తుచ్చేది సీఈఓ జుకర్ బర్గ్ మాత్రమే. ఫేస్ బుక్ తన ప్లాట్ ఫాంను విస్తరించుకుంటూ యూజర్లకు చేరువైంది. అలా ఫేస్ బుక్.. ప్రపంచవ్యాప్తంగా (2.3 బిలియన్లు) 230 కోట్ల మంది యూజర్లకు చేరిపోయింది. జుకర్ బర్గ్.. ఫేస్ బుక్ సీఈఓగా… 23ఏళ్ల వయస్సులోనే ప్రపంచ యంగెస్ట్ బిలినీయర్ గా అవతరించాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. మార్క్ జుకర్ బర్గ్ ప్రపంచ ర్యాకింగ్స్ లో 62.3 బిలియన్ల డాలర్ల ఆదాయంతో 8వ ర్యాంకులో ఉన్నాడు. ఫేస్ బుక్ సీఈఓగా మార్క్.. 1 డాలర్ వేతనంగా తీసుకుంటున్నాడు.   

జుకర్ బర్గ్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇదిగో : 
* జుకర్ బర్గ్.. 12ఏళ్ల వయస్సులోనే ‘జుక్ నెట్’ మెసేజింగ్ ప్రొగ్రామ్ క్రియేట్ చేశాడు.
* గ్రాడ్యుయేషన్ సమయంలో AOL, మైక్రోసాఫ్ట్ నుంచి జాబ్ ఆఫర్లు వచ్చాయి.. కానీ, వారు తిరస్కరించారు.
* 2012లో ఫేస్ బుక్ ను పబ్లిక్ లో తీసుకొచ్చాడు. ఇప్పటికి స్టాక్4 లో 15శాతం వాటా ఉంది.
* గత మూడు ఏళ్లగా ఒక డాలర్ జీతంగా తీసుకుంటున్నాడు. (ఫోర్బ్స్ జాబితా ప్రకారం..)
* 2018 ఏడాదిలో ఫేస్ బుక్.. సెక్యూరిటీ దృష్ట్యా 22.6 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది.
* మార్క్, అతడి భార్య తమ జీవితకాలంలో ఫేస్ బుక్ వాటా నుంచి 99శాతాన్ని ఇస్తామని వాగ్దానం చేశారు.
* జుకర్ బర్గ్ కు రెడ్ గ్రీన్ కలర్ వర్ణాంధత్వ సమస్య ఉంది.. అందుకే.. ఫేస్ బుక్ బ్లూ కలర్ లో ఉంటుంది. 
* 2011లో గూగుల్ ప్లస్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గే బెరిన్ కంటే జుకర్ బర్గ్ కే ఎక్కువ మంది ఫాలోవర్లు
* గూగుల్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మోస్ట్ ఫాలోడ్ యూజర్లు ఉన్న వ్యవస్థపాకుడు జుకర్ బర్గ్ మాత్రమే.
* జుకర్ బర్గ్ ఫేస్ బుక్ కు.. 118,404, 378 మంది ఫాలోవర్లు ఉన్నారు. 
* మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన ట్విట్టర్ అకౌంట్ ఇప్పటివరకూ వెరిఫై కాలేదు.