FB-Instagram Like Hide : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లైక్ కౌంట్’ హైడ్ చేసుకోండిలా..!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త ఆప్షన్ తీసుకొచ్చాయి.. అదే.. Hide Like Count.. ఈ రెండు సోషల్ ప్లాట్ ఫాంలోని అన్ని పోస్టులకు లైక్ కౌంట్ కనిపించదు.

FB-Instagram Like Hide : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లైక్ కౌంట్’ హైడ్ చేసుకోండిలా..!

Facebook, Instagram Finally Brings The Option To Hide Like Count

FB-Instagram Like Hide : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త ఆప్షన్ తీసుకొచ్చాయి.. అదే.. Hide Like Count.. ఈ రెండు సోషల్ ప్లాట్ ఫాంలోని అన్ని పోస్టులకు లైక్ కౌంట్ కనిపించదు. ఎంతమంది మీ పోస్టు లైక్ చేశారో ఇకపై పబ్లిక్‌గా కనిపించదు.. ఈ ఆప్షన్ కంట్రోల్ కూడా యూజర్లకే ఇచ్చేశాయి కూడా. 2019 నుంచి ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంపై హైడ్ లైక్ కౌంట్ ఆప్షన్ కోసం టెస్టింగ్ చేస్తోంది.

లైక్ కౌంట్ యూజర్లకు కనిపించడం ద్వారా వారిలో నిరుత్సాహనికి దారితీస్తోందని అంటోంది. తద్వారా యూజర్లలో మానసికంగా ఒత్తిడికి కారణమవుతుందని అభిప్రాయపడింది. అందుకే లైక్ కౌంట్ ఆప్షన్ హైడ్ చేసుకునే ఆప్షన్ తీసుకొచ్చినట్టు పేర్కొంది.

మరోవైపు ఇన్ స్టాగ్రామ్ కూడా తమ ప్లాట్ ఫాంపై యూజర్లకు లైక్ హైడ్ కౌంట్ కనిపించకుండా చేసింది. మే 26 నాటికి యూజర్లకు ఈ హైడ్ లైక్ కౌంట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ హైడ్ లైక్ కౌంట్ ఆప్షన్ ఫేస్ బుక్, ఇన్ స్టాలో ఎలా హైడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ఇన్‌స్టాలో లైక్ కౌంట్ హైడ్ :
– యూజర్ తన పోస్టుపై లైక్ కౌంట్ షేర్ చేయడానికి ముందు ఆ తర్వాత కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు.
– ఇన్ స్టా అకౌంట్లో కుడివైపు కార్నర్‌లో మూడు డాట్లు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేయండి.
– Hit Like Count అనే ఆప్షన్ పై Tap చేయండి.
– ఈ ఆప్షన్ యూజర్లు ఎప్పుడంటే అప్పుడు Settings ద్వారా టర్న్ ఆఫ్ లేదా అన్ చేసుకోవచ్చు.

ఇన్ స్టా Feedపై హైడ్ చేయాలంటే? :
– మీ అకౌంట్లో ఇతరుల పోస్టులకు లైక్ కౌంట్ కూడా హైడ్ చేసుకోవచ్చు.
– సెట్టింగ్స్ లోకి వెళ్లి ఏ పోస్టులకు హైడ్ చేయాలో సెలక్ట్ చేసుకోండి..
– ఫీడ్‌లో Hide Like, View Counts ఆప్షన్ వద్ద అన్ని పోస్టులకు లేదా ఏదైనా పోస్టుకు సెలక్ట్ చేయండి.

ఫేస్‌బుక్‌లో లైక్ కౌంట్ హైడ్ చేయాలంటే? :
– ఇన్ స్టాగ్రామ్ మాదిరిగానే లైక్ కౌంట్ ఆప్షన్ హైడ్ చేయండి.
– రెండు ప్లాట్‌ఫాంల్లో ఫంక్షనాలిటీ ఒకేలా ఉంటుంది..
– ఒక పోస్టు లేదా అన్ని పోస్టులకు కావాలంటే హైడ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.