Like Count Hide : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కౌంట్ హైడ్ చేసుకోవచ్చు!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై లైక్ కౌంట్ హైడ్ చేసుకోవచ్చు. ఫేస్ బుక్, ఇన్ స్టాలో పోస్టులు, వారి ఫొటోలను ఎంతమంది లైక్ కొట్టారో సంఖ్య కనిపించదు.

Like Count Hide : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కౌంట్ హైడ్ చేసుకోవచ్చు!

Like Count Hide

Facebook, Instagram Like Count : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై లైక్ కౌంట్ హైడ్ చేసుకోవచ్చు. ఫేస్ బుక్, ఇన్ స్టాలో పోస్టులు, వారి ఫొటోలను ఎంతమంది లైక్ కొట్టారో సంఖ్య కనిపించదు. 2019 నుంచే ఇన్ స్టాగ్రామ్ లైకులను హైడ్ చేస్తోంది. చాలా మంది యూజర్లు ఈ ఫీచర్‌ను స్వాగతించారు.

తమ పోస్టులను ఎవరైనా లైకు చేయకపోతే మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. నిరూత్సాహనికి లోనవుతుంటారు. అందుకే ఫేస్ బుక్, ఇన్ స్టాలు యూజర్ లైక్ కౌంట్లను హైడ్ చేయాలని భావించింది. గతంలో యూజర్లను ఫొటోలపై లైకులను దాచడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు, లైక్ హైడ్ చేయడంపై టెస్టింగ్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కౌంట్ హైడ్ చేయాలంటే.. మీరు సెట్టింగ్‌లోకి వెళ్లండి. పోస్ట్‌లు సెక్షన్‌పై క్లిక్ చేయవచ్చు. అక్కడ లైక్ కౌంట్ స్టాప్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీ అన్ని పోస్ట్‌లకు వర్తిస్తుంది. మీరు పోస్ట్‌ను షేర్ చేయడానికి ముందు కౌంట్ హైడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

మీరు ఈ సెట్టింగ్‌ను పోస్టు లైవ్ చేసిన తర్వాత కూడా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఈ ఫీచర్ బుధవారం నుంచి ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది.. రాబోయే వారాల్లో ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.