ఫేస్‌బుక్‌లో ‘రీల్స్’ ఫీచర్.. ఇన్‌స్టాలానే షార్ట్ వీడియోలు పోస్టు చేసుకోవచ్చు..

ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఫేస్‌బుక్ సొంత యాప్ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఫీచర్‌ను ఫేస్‌బుక్ కూడా తమ యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. ఇన్‌స్టా మాదిరిగానే ఫేస్‌బుక్‌లోనూ షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో ‘రీల్స్’ ఫీచర్.. ఇన్‌స్టాలానే షార్ట్ వీడియోలు పోస్టు చేసుకోవచ్చు..

Facebook Reels : ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఫేస్‌బుక్ సొంత యాప్ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఫీచర్‌ను ఫేస్‌బుక్ కూడా తమ యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. ఇన్‌స్టా మాదిరిగానే ఫేస్‌బుక్‌లోనూ షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. భారతదేశంలోని ఫేస్ బుక్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ వాడేందుకు అనుమతినిచ్చింది. ఇకపై టిక్ టాక్ మాదిరిగా షార్ట్ వీడియోలను పోస్టు చేసుకోవచ్చు.

ఇండియాలోని కంటెంట్ క్రియేటర్ల కోసం ఫేస్ బుక్ ఈ షార్ట్ వీడియోల ఫీచర్ ను యాడ్ చేసింది. ఫేస్ బుక్ యాప్ ద్వారా ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికమండ్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫేస్ బుక్ రీల్స్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. ప్రతిఒక్కరికి త్వరలో అందుబాటులోకి రానుంది.

క్రియేట్ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేస్తే.. 10 సెకన్ల నుంచి 15 సెకన్ల వరకు షార్ట్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. అందులో మ్యూజిక్, ఫిల్టర్లు, మరెన్నో ఎడిట్స్ చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ఫీచర్ కూడా ఫేస్ బుక్ రికమండ్ రీల్స్ ఆప్షన్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కూడా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది.