Facial Recognition : ఫేస్ ప్రింటర్లను తొలగించనున్న ఫేస్ బుక్

సోషల్ మీడియాలో ఒకటైన ఫేస్ బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత గోప్యతపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో...సంచలన నిర్ణయం తీసుకుంది.

Facial Recognition : ఫేస్ ప్రింటర్లను తొలగించనున్న ఫేస్ బుక్

Fb

Facebook Facial Recognition : సోషల్ మీడియాలో ఒకటైన ఫేస్ బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత గోప్యతపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో…సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ లో ఫేషియల్ రిగ్నైషన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఫేస్ ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ కంపెనీ మాతృసంస్థ ‘మెటా’ వెల్లడించింది. ఇదొక భారీ మార్పుగా ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి తెలిపారు.

Read More : Raviteja : రవితేజ పాన్ ఇండియా సినిమా

ఫేస్ బుక్ లో దీనిని ఉపయోగిస్తున్న వారు..భవిష్యత్ లో ఈ టెక్నాలజీని ఉపయోగించలేరని, ముఖ గుర్తింపు కోసం ఉపయోగించే…టెంప్లేట్ లను సైతం తొలగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న సామాజిక ఆందోళనలకు వ్యతిరేకంగా…బ్యాలెన్స్ చేసేందుకే…ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీని 2010లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మూడొంతుల మంది ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

Read More : Khel Ratna : ఖేల్ రత్నాలు వీరే..12 మంది క్రీడాకారులు

ప్రస్తుతం దీనిని తొలగించడం వల్ల…చాలా మంది ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. ప్రధానంగా దృష్టిలోపం ఉన్న వారికి ఉపయోగపడే..ఆటోమెటిక్ ఆల్ట్ టెక్ట్స్ పై దీని ప్రభావం పడనుంది. ఫొటోలు, వీడియోల్లోని…ముఖాలను ఫేస్ బుక్ దానంతట అది ఇక గుర్తించదు. ఫొటోల్లోని వ్యక్తులను ఇతరులను గుర్తించకుండా సాధ్యపడనుంది. ఫేస్ రికగ్నైషన్ సాంకేతికతతో ప్రమాదం పొంచి ఉందని..సర్వత్రా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు…మెటా వెల్లడించింది. గత కొన్నిరోజులుగా…ఫేస్ బుక్ వ్యక్తిగత గోప్యతపై పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో…తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.