Facebook : యూజర్లకు గుడ్ న్యూస్, ఫేస్ బుక్ లైవ్ ఆడియో రూమ్స్!

ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్ గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియేట్ చేసి ఫీచర్ ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్ బుక్ ప్రయత్నాలు చేస్తున్నట్ల సమాచారం.

10TV Telugu News

Facebook LIVE Audio Rooms : ఫేస్ బుక్ ఉయోగించే యూజర్లకు గుడ్ న్యూస్. లైవ్ ఆడియో రూమ్స్ ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, డెస్క్ టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఈ ఆడియో రూమ్స్ కొంతమంది సెలబ్రెటీలకు, కొన్న గ్రూప్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్ గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియేట్ చేసి ఫీచర్ ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్ బుక్ ప్రయత్నాలు చేస్తున్నట్ల సమాచారం. ఫేస్ బుక్ క్లబ్, ట్విట్టర్ స్పేస్ తరహాలో ఆడియో రూమ్స్ ను క్రియేట్ చేసేందుకు రెడీ చేస్తున్నారు.

Read More : Nifty – Sensex : స్టాక్ మార్కెట్ లో ‘పండుగ’ జోష్

ఇందులో భాగంగా…లైవ్ ఆడియో రూమ్స్ లో స్పీకర్ గా చేరడానికి ప్రజలను ఆహ్వానించేందుకు శక్తి హోస్ట్ కు అర్హత ఉంది. స్పీకర్ చేసి సంభాషణను ఎవరైనా వినొచ్చే వీలుంది. లైవ్ ఆడియో రూమ్స్ ను గ్రూప్ అడ్మిన్స్ కంట్రోల్ చేసే అవకాశం కల్పించారు. ఈ రూమ్స్ ఫీచర్ యాప్ లో ఫేస్ బుక్ వాచ్ ట్యాబ్ దగ్గర కనిపిస్తుంది.

Read More : Offline Digital Payments : ఆర్బీఐ ట్రయల్ సక్సెస్, నెట్ లేకుండా చెల్లింపులు..ఎలా చేస్తారు ?

ప్రస్తుతం ఫేస్ బుక్ లైవ్ వీడియో కేవలం 50 మంది స్పీకర్ కు మాత్రమే అనుమతినిస్తుంది. వీరు ఏం మాట్లాడుకుంటారో వినేవారికి ఎలాంటి పరిమితిని విధించలేదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే..కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. ట్విట్టర్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి యాప్స్ న డౌన్ లోడ్ చేసుకోవడంలో యూజర్లకు కాస్త ఉపశమనమే అని చెప్పవచ్చు.