గూగూల్ మహిళా ఉద్యోగికి ఫేస్ బుక్ భారీ నజరానా

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 11:35 AM IST
గూగూల్ మహిళా ఉద్యోగికి  ఫేస్ బుక్ భారీ నజరానా

facebook-messenger

Facebook Messenger security : గూగుల్ మహిళా ఉద్యోగికి ఫేస్ బుక్ భారీ నజరానాను ప్రకటించింది. తమకు సంబంధించిన యాప్ లో ఓ లోపాన్ని గుర్తించినందుకు బహుమతిని అందచేసింది. ఆ లోపాన్ని వెంటనే సరిచేసిందని సమాచారం. ఫేస్ బుక్ యొక్క మెసెంజర్ యాప్ లో కీలకమైన లోపం ఉందని గూగుల్ కు చెందిన ప్రాజెక్టు జీరో బగ్ – హంటింగ్ లో పనిచేసే నటాలీ సిల్వనోవిచ్ అనే మహిళా ఉద్యోగి గుర్తించారు.



https://10tv.in/youtube-to-run-ads-on-some-creators-videos-without-sharing-revenue/
ఈ లోపంతో మెసెంజర్ యాప్ లో ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు వినే అవకాశం ఉన్న విషయాన్ని తన రిపోర్టులో వెల్లడించారు. ఫేస్ బుక్ వినియోగదారులపై ఈ లోపం ద్వారా హ్యాకర్లు నిఘా పెట్టే అవకాశం ఉందని జెడ్ నెట్ నివేదించింది. అక్టోబర్ 06వ తేదీన గుర్తించిన ఆమె..ఫేస్ బుక్ కి సమాచారం అందించారని తెలుస్తోంది. ఈ లోపాన్ని గుర్తించినందుకు సిల్వనోవిచ్ కు60 వేల డాలర్లు (సుమారు 44 లక్షల రూపాయలు) బహుమతిని అందచేసింది. గతంలో కూడా ఈమె..పలు యాప్స్ లో ఉన్న లోపాలను గుర్తించారు.