యూజర్లలో ఆందోళన : సతాయిస్తున్న Facebook.. నిలిచిన సర్వీసులు

  • Published By: sreehari ,Published On : November 28, 2019 / 02:25 PM IST
యూజర్లలో ఆందోళన : సతాయిస్తున్న Facebook.. నిలిచిన సర్వీసులు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సర్వీసులు నిలిచిపోయాయి. గురువారం (నవంబర్ 28, 2019) రాత్రి 7.30 గంటల ప్రాంతం నుంచి ఫేస్ బుక్ సర్వీసులు నిలిచిపోయినట్టు ఓ రిపోర్టు తెలిపింది. చాలామంది యూజర్లు తమ ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ కాలేక పోతున్నమంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఎక్కువగా డెస్క్ టాప్ యూజర్లకు ఈ సమస్య తలెత్తినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అప్పటికే అకౌంట్ లాగిన్ అయిన కొంతమంది యూజర్లకు మాత్రం తమ టైమ్ లైన్‌లో పోస్టింగ్ ఆప్షన్ డిజేబుల్ అయినట్టు చెబుతున్నారు. డెస్క్ టాప్ యూజర్లు ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అయ్యే క్రమంలో Facebook Will Be Back Soon అనే నోటిఫికేషన్ వస్తోంది.

‘కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.  ప్రస్తుతం.. సైటు మెరుగుదల కోసం ఫేస్ బుక్ సర్వీసులను నిలిపివేయాల్సిన అవసరం తలెత్తింది. కానీ, కొన్ని నిమిషాల్లో తిరిగి సర్వీసులను పునరుద్ధరిస్తాం. ఈ మెసేజ్ కనిపించిన యూజర్లంతా కాస్త ఒపిగ్గా ఉండాలి’ అని తెలిపింది.

ఫేస్ బుక్ నోటిఫికేషన్ లో చెప్పినట్టుగానే కొన్ని నిమిషాల్లోనే తిరిగి ఫేస్ బుక్ సర్వీసులు పనిచేయడం ప్రారంభించాయి. కొన్ని నిమిషాల వ్యవధిలో లాగిన్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లంతా అమ్మయ్యా ఫేస్ బుక్ మళ్లీ వచ్చేందంటూ ఊపిరిపీల్చుకున్నారు.

మళ్లీ  కాసేపటికి ఫేస్ బుక్ సర్వీసులు నిలిచిపోయాయి. కాసేపు వచ్చినట్టే వచ్చి మళ్లీ సర్వీసు నిలిచిపోతూ యూజర్లను తెగ సతాయిస్తోంది. దీంతో యూజర్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
Facebook Services outrage due to server maintenance