Facebook Lock : ఫేస్‌బుక్‌పై యూజర్ల ఆగ్రహం.. కారణం లేకుండానే అకౌంట్లు లాక్..!

Facebook accounts locked : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ యూజర్ల అకౌంట్లను లాక్ చేసింది.

Facebook Lock : ఫేస్‌బుక్‌పై యూజర్ల ఆగ్రహం.. కారణం లేకుండానే అకౌంట్లు లాక్..!

Facebook Users Angry After Accounts Locked For No Reason (1)

Facebook accounts locked : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ యూజర్ల అకౌంట్లను లాక్ చేసింది. ఎందుకు అకౌంట్లను లాక్ చేయాల్సి వచ్చిందో సరైన కారణాన్ని వెల్లడించలేదు. ఏ కారణం లేకుండానే ఫేస్ బుక్ అకౌంట్లను లాక్ చేయడంపై ఎఫ్‌బీ యూజర్లు మండిపడుతున్నారు. ఉన్నట్టుండి చాలామంది FB యూజర్లకు అకౌంట్లను లాక్ చేసినట్టుగా మెసేజ్ లు పంపుతోంది. ‘మీ Facebook అకౌంట్ మా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా రన్ అవుతోంది. మీ అకౌంట్ ను నిలిపివేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం’ అంటూ మెసేజ్ లో ఉంది. అకౌంట్లను లాక్ చేయడానికి ముందు Meta కంపెనీ ఎలాంటి హెచ్చరిక చేయలేదు.

అలాగే లాక్ చేయడానికి గల కారణాన్ని కూడా మెటా యాజమాన్యం వివరణ ఇవ్వలేదు. దీనిపై FB యూజర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే యూజర్ల ఫిర్యాదులపై స్పందించిన Meta కంపెనీ దర్యాప్తు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా మెటా కంపెనీ ప్రతినిధి మెటా ఆండీ స్టోన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొంతమంది యూజర్లకు తమ Facebook అకౌంట్లను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. ఇప్పటివరకూ ఎంతమంది ఫేస్ బుక్ యూజర్లు Account Lock సమస్యను ఎదుర్కొన్నారో తమకు తెలియదన్నారు ఆండీ..

Facebook Users Angry After Accounts Locked For No Reason (2)

Facebook Users Angry After Accounts Locked For No Reason

PR కన్సల్టెంట్ జెన్ రాబర్ట్స్ తన FB అకౌంట్ లాక్ అయినట్టు ముందుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కొంతకాలంగా నా FB అకౌంట్లో ఏమీ పోస్ట్ చేయలేదు. ఎలాంటి కామెంట్లను పెట్టలేదు. నా అకౌంట్లో ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులను పెట్టలేదు’ స్పష్టం చేశారు. తాను ఎంతో ఇష్టంగా దాచుకున్న ఒకప్పటి స్కూల్, కాలేజీకి సంబంధించిన ఫొటోలు, కుటుంబ సభ్యుల ఫొటోలు వంటి పర్సనల్ వివరాలు అకౌంట్లో ఉన్నాయని ఆమె తెలిపింది.

దాదాపు 15 సంవత్సరాలకు పైగా అప్ లోడ్ చేసిన నా కంటెంట్‌కు ఇకపై తిరిగి యాక్సెస్‌ను చేసుకోలేనమాట.. ఇది చాలా బాధాకారమని తెలిపింది. అసలు తన అకౌంట్లో ఏ తప్పు జరిగిందో తెలియక ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. లాక్ అయిన FB అకౌంట్ తిరిగి రికవరీ చేయడానికి ఎలాంటి ఆధారం లేకపోవడతంతో ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకౌంట్ బ్లాక్ చేయడంపై జెన్ రాబర్ట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also : Facebook: యాక్టివేట్ చేసుకోపోతే ఫేస్‌బుక్ లాక్ అయిపోయినట్లే