ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంను మరింత సెక్యూర్ చేయనుంది. ఇప్పటికే ఫేస్ బుక్ లో యూజర్ల డేటా దుర్వినియోగానికి గురవుతుందనే ఆరోపణలతో సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తమ ప్లాట్ ఫాంపై మెసేజ్ లను ఎన్ క్రిప్ట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.

ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంను మరింత సెక్యూర్ చేయనుంది. ఇప్పటికే ఫేస్ బుక్ లో యూజర్ల డేటా దుర్వినియోగానికి గురవుతుందనే ఆరోపణలతో సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తమ ప్లాట్ ఫాంపై మెసేజ్ లను ఎన్ క్రిప్ట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంను మరింత సెక్యూర్ చేయనుంది. ఇప్పటికే ఫేస్ బుక్ లో యూజర్ల డేటా దుర్వినియోగానికి గురవుతుందనే ఆరోపణలతో సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తమ ప్లాట్ ఫాంపై మెసేజ్ లను ఎన్ క్రిప్ట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ఫేస్ బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్లాట్ ఫాంపై యూజర్ల మెసేజ్ లను end to end ఎన్ క్రిప్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై యూజర్ల మెసేజ్ లు ఎన్ క్రిప్ట్ కానున్నాయి. అదే.. ‘ప్రైవేట్’మెసేజింగ్ ప్లాట్ ఫాం సర్వీసు. ఫేస్ బుక్ యూజర్లు ప్రైవేట్, ఎన్ క్రిప్టెడ్ సర్వీసులపై మెగ్గు చూపుతున్నారని, మొబైల్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ కూడా ఎన్ క్రిప్టెడ్ సర్వీసులను అందించనున్నట్టు జూకర్ బర్గ్ తెలిపారు.  
Also Read : ఫస్ట్ టైం : రూ.20 కాయిన్ వచ్చేస్తోంది

‘‘వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ ఫాం తరహాలో ఫేస్ బుక్ ప్లాట్ ఫాంను డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. యూజర్ల మెసేజ్ లను ప్రైవేట్ చేయడంపై దృష్టి పెట్టాం. ఎంతవరకూ వాట్పాప్ తరహాలో యూజర్ల డేటాను సెక్యూర్ చేయడం సాధ్యం అనేదానిపై వర్క్ చేస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఓపెన్ ప్లాట్ ఫాం సర్వీసుల కంటే ప్రైవేట్ మెసేజింగ్ సర్వీసులు సెక్యూర్ గా ఉంటాయని విశ్వసిస్తున్నట్టు జూకర్ అభిప్రాయపడ్డారు. 

ఫేస్ బుక్ ప్లాట్ ఫాంను అన్ని విధాలుగా యూజర్లకు ఉపయోగపడేలా డెవలప్ చేయబోతున్నట్టు తెలిపారు. వాయిస్ కాల్స్, వీడియో చాట్స్, గ్రూపులు, స్టోరీలు, బిజినెస్, పేమెంట్స్, కామర్స్ సహా ఇతర సర్వీసులతో యూజర్లు ఇంటర్ కనెక్ట్ అయ్యేలా ఫేస్ బుక్ ప్లాట్ ఫాంను బిల్డ్ చేయనున్నట్టు జూకర్ బర్గ్ తెలిపారు. ‘ప్రైవసీ ఫోకసడ్ ప్లాట్ ఫాం’పై యూజర్ల ప్రైవేట్ ఇంట్రాక్షన్స్, ఎన్ క్రిప్షన్ తో ఉండేలా బిల్డ్ చేయనున్నట్టు చెప్పారు.
Also Read : ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు

ఇందుకోసం ఫేస్ బుక్ వాట్సాప్ తరహాలో అన్ని మెసేజింగ్ ప్లాట్ ఫాంలతో ఫేస్ బుక్ ప్లాట్ ఫాంను మెర్జ్ చేయనున్నట్టు తెలిపారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వీసులను ఇంటర్ కనెక్ట్ చేయనున్నట్టు చెప్పారు. తద్వారా యూజర్లు తమ అకౌంట్ల నుంచి స్నేహితులతో ఇంట్రాక్ట్ అయ్యేందుకు సులభంగా ఉంటుందని జూకర్ బర్గ్ అన్నారు. ఫేస్ బుక్ లో ప్రస్తుతం 2.32 బిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. వాట్పాప్ లో 1.5 బిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో ఒక బిలియన్ మంది నెలవారీ యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. 

Also Read : వన్ నేషన్.. వన్ కార్డ్: ఉపయోగాలు ఇవే!  

×