Fake JBL Music Systems : మీ కారులో కొత్త మ్యూజిక్ సిస్టమ్ కొనేందుకు చూస్తున్నారా? ఫేక్ JBL మ్యూజిక్ సిస్టమ్స్‌తో జాగ్రత్త.. కొనే ముందు ఎలా గుర్తించాలో తెలుసా?
Fake JBL Music Systems : మీ కారులో కొత్త మ్యూజిక్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే భారత్‌లో చాలా మంది కార్ యాక్సెసరీస్ డీలర్లు ఫేక్ ప్రొడక్టులను విక్రయిస్తున్నారట..

Fake JBL Music Systems : మీ కారులో కొత్త మ్యూజిక్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే భారత్‌లో చాలా మంది కార్ యాక్సెసరీస్ డీలర్లు ఫేక్ ప్రొడక్టులను విక్రయిస్తున్నారట.. అందుకే కారు మ్యూజిక్ సిస్టమ్ కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు తప్పక చెక్ చేసుకోవాలని కంపెనీ వినియోగదారులను హెచ్చరిస్తోంది. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు JBL కంపెనీ ఇన్ఫినిటీ మాతృ సంస్థ అయిన హర్మాన్ భారత మార్కెట్లో ఫేక్ JBL ఇన్ఫినిటీ కార్ ఆడియో ప్రొడక్టుల తయారీ, అక్రమ విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది.

Many car dealers in India are selling fake JBL music systems
ఇటీవలే, బెంగళూరులోని మూడు మార్కెట్లలో కంపెనీ దాడులు నిర్వహించింది. అందులో నలుగురు కార్ ఆఫ్టర్‌మార్కెట్ డీలర్లు ఫేక్ JBL, ఇన్ఫినిటీ ప్రొడక్టులను విక్రయిస్తున్నట్లు హర్మాన్ గుర్తించింది. 500కి పైగా ఫేక్ ప్రొడక్టులను హర్మాన్ దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. JBL సింబల్ JBZ, IGLగా మార్పిడి చేస్తూ JBL ఇన్ఫినిటీని పోలి ఉండే ఫేక్ ప్రొడక్టులను విక్రయిస్తున్నట్టు కంపెనీ దర్యాప్తులో తేలింది. ప్యాకేజింగ్‌లో విక్రయించే ప్రొడక్టులను రెండు ప్రదేశాలలో విక్రయించడాన్ని కంపెనీ బృందం కనుగొంది.
ఫేక్ ప్రొడక్టులకు సంబంధించి హర్మాన్ ఇండియా లైఫ్‌స్టైల్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘మా బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే అత్యుత్తమైన ప్రొడక్టులను కస్టమర్లకు అందించడం HARMANకి చాలా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఐకానిక్ ఆడియోను అందించేందుకు కృషి చేస్తున్నాం. అత్యుత్తమ క్వాలిటీ కలిగిన ప్రొడక్టులు, బ్రాండ్ నిబద్ధతను కొనసాగిస్తున్నాం. కస్టమర్లను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మార్కెట్లోని ఫేక్ ప్రొడక్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధికారిక డీలర్ల నుంచి మాత్రమే HARMAN ప్రొడక్టులను కొనుగోలు చేయాలి’ అని సూచనలు చేశారు.

Many car dealers in India are selling fake JBL music systems
2022లో కూడా హర్మాన్ ఫేక్ ప్రొడక్టుల డీలర్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఢిల్లీ అంతటా ఉన్న కార్ యాక్ససరీస్ షాపులు, తయారీ యూనిట్ల నుంచి JBL ఇన్ఫినిటీ వినియోగదారు ప్రొడక్టుల స్టాక్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ ప్రొడక్టులను కొనుగోలు చేయకుండా ఉండేందుకు వినియోగదారులు హై-క్వాలిటీ మెటీరియల్స్, ప్యాకేజింగ్, లోగో ప్లేస్మెంట్/కలర్ పరిశీలించాలని, ప్రొడక్టులను కెమెకల్ తెలుసుకోవాలని సూచించారు. అధికారిక డీలర్లను గుర్తించడానికి, ఎల్లప్పుడూ అధీకృత రిటైలర్/డీలర్ సర్టిఫికేట్ ఉందో లేదో చెక్ చేయాల్సి ఉంటుందని కంపెనీ వినియోగదారులకు సూచించింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..