Coca-Cola Edition Phone : రియల్‌మి నుంచి కోకా-కోలా ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 10న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
First Coca-Cola Edition Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. రియల్‌మి10 ప్రో మాదిరిగా కోకా-కోలా ఎడిషన్ ఫిబ్రవరి 10న భారత మార్కెట్లో లాంచ్ చేయనుందని ప్రకటించింది.

First Coca-Cola Edition Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. రియల్‌మి10 ప్రో మాదిరిగా కోకా-కోలా ఎడిషన్ ఫిబ్రవరి 10న భారత మార్కెట్లో లాంచ్ చేయనుందని ప్రకటించింది. కోకా-కోలా కంపెనీ సహకారంతో, ఇప్పటికే అందుబాటులో ఉన్న రియల్‌మి 10 ప్రో మోడల్ UIలో కొన్ని ట్వీక్‌లతో ప్రత్యేక కలర్ పొందవచ్చు.
గత ఏడాదిలో Realme GT Neo 3 థోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసేందుకు బ్రాండ్ మార్వెల్‌తో కలిసి పనిచేసింది. ఇది Realme మొదటి సహకారం కాదనే చెప్పాలి. రాబోయే Coca-Cola ఎడిషన్ 5Gకి సపోర్టు ఇస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Realme 10 Pro ఫోన్ మాదిరిగానే Coca-Cola ఎడిషన్ వస్తుంది. ఇప్పటికే ఉన్న Realme 10 Pro ఫీచర్ల మాదిరిగానే ఒకే విధంగా కస్టమర్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 695 5Gతో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేని పొందవచ్చు. డిస్‌ప్లే ఫుల్-HD రిజల్యూషన్‌ను అందిస్తుంది.
సాధారణంగా, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ప్రత్యేక ఎడిషన్ ఫోన్ కోసం అత్యధిక స్టోరేజ్ మోడల్‌ను అందిస్తాయి. Realme 10 Pro ఫోన్ Coca-Cola ఎడిషన్ 8GB RAM, 128GB స్టోరేజీతో రావచ్చు. వెనుక ప్యానెల్‌లో 108-MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. ముందు భాగంలో 16-MP సెల్ఫీ స్నాపర్ ఉంటుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

First Coca-Cola edition phone in collaboration with Realme to launch in India
ధర విషయంలో క్లారిటీ లేదు. Realme 10 Pro మోడల్ Coca-Cola ఎడిషన్ ప్రత్యేకంగా యువత కోసం రూపొందించినట్టు Realme చెప్పింది. భారత మార్కెట్లో ధర రూ. 20వేల లోపు ఉండవచ్చు. రియల్‌మి ఫోన్ కోకా-కోలా మోడల్ అత్యంత ఆకర్షణీయమైనదిగా ఉంటుందని కంపెనీ చెప్పింది. Realme 10 Pro 5G కోకా-కోలా ఎడిషన్ అనేది Realme డిజైన్-ఫార్వర్డ్ స్పిరిట్‌తో వస్తుంది. రియల్‌మి ద్వారా మరో డిజైన్-ఫార్వర్డ్ స్మార్ట్‌ఫోన్‌కు కొత్తదనాన్ని అందిస్తుంది.
Coca-Cola సహకారంతో రియల్‌మి ఫోన్ Realme 10 Pro Plusకి బదులుగా Realme 10 Proని పొందవచ్చు. Realme 10 Pro Plus, Realme 10 Proతో పాటు డిసెంబర్‌లో లాంచ్ అయింది. ఈ బేస్ మోడల్ 6GB RAM +128GB వేరియంట్‌కు రూ. 24,999, టాప్ 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999గా ఉంది. Realme 10 Pro Plus MediaTek డైమెన్సిటీ 1080 SoC నుంచి పవర్ అందిస్తుంది.
108-MP ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంది. ప్రధాన కెమెరా 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో షూటర్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16-MP కెమెరా కూడా ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వేరియంట్‌ను కూడా కలిగి ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..