Royal Enfield Interceptor 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్

ఇండియన్ మార్కెట్‌లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్.. మోటార్ సైకిలిస్టుల్లో ఓ రకమైన క్రేజ్ తీసుకొచ్చిన బ్రాండ్ ఇది. భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న బ్రాండ్.

Royal Enfield Interceptor 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్

Royal Enfield Interceptor 650

Royal Enfield Interceptor 650: ఇండియన్ మార్కెట్‌లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్.. మోటార్ సైకిలిస్టుల్లో ఓ రకమైన క్రేజ్ తీసుకొచ్చిన బ్రాండ్ ఇది. భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న బ్రాండ్. అంతేకాదు వరల్డ్స్ ఓల్డెస్ట్ టూ వీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్ కూడా. రీసెంట్ గా అందులో మోడల్స్ ను కూడా మార్చి లాంచ్ చేస్తుంది రాయల్ ఎన్‌ఫీల్డ్.

ట్విన్ సిలిండర్ మోటార్ సైకిల్ మోడల్స్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. వీటిల్లో ఒక దానిని సొంతం చేసుకున్న తొలి మహిళా పోలీస్ గా నిలిచారు ఈమె. ఇది తీసుకోవడానికి కూడా ప్రత్యేక కారణముందని చెప్తున్నారు.

మహిళలు కూడా టూ వీలర్ ను హ్యాండిల్ చేయగలరని ప్రూవ్ చేయడానికే తీసుకున్నానని చెప్తున్నారామె. ఇది ఆమె మొదటి టూ వీలర్ కూడా కాదు. ఫోర్స్ లో జాయిన్ అయినప్పుడే బజాజ్ చేతక్ తీసుకుని ఆ తర్వాత స్కూటర్స్ వాడారు. అవి నడుపుతున్నప్పటికీ ఆమె సంతృప్తి చెందలేదట.

చాలా ఏళ్లు స్కూటర్స్ నడిపిన ఆమె.. 2015లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 కొనుగోలు చేశారు. కొంతకాలం అది కూడా నడిపిన ఆమె.. రాయల్ ఎన్ ఫీల్డ్ 500సీసీ నడిపారు. దాని మీదనే నైట్ పాట్రోలింగ్ కు కూడా వెళ్లేవారట. ఇక తర్వాత ఇంటర్‌సెప్టార్ 650 మీద ప్రేమ పెంచుకున్నారు. దానిపై చాలా మందిని అడిగి పాజిటివ్ వచ్చిన తర్వాత… టెస్ట్ రైడ్ చేసి ఇంప్రెస్ అవడంతో ఇక కొనేశారు.