Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20వేల బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. మీకు నచ్చిన బెస్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్లస్ మెంబర్‌షిప్ యూజర్ల కోసం ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది. అధికారికంగా సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్ సేల్ అందుబాటులోకి రానుంది.

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20వేల బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. మీకు నచ్చిన బెస్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Flipkart Big Billion Days Sale _ Best phone deals under Rs 20,000

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్లస్ మెంబర్‌షిప్ యూజర్ల కోసం ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది. అధికారికంగా సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్ సేల్ అందుబాటులోకి రానుంది. మీరు రూ. 20,000లోపు కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది. అందులో మీకు నచ్చిన బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

అందుకు ఇదే సరైన సమయం. ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు ప్రీపెయిడ్ ఆర్డర్‌లు, బ్యాంక్ కార్డ్‌లపై ఆధారపడి ఉంటాయి. చాలా ఫోన్‌లపై కొంత డిస్కౌంట్ కూడా పొందవచ్చు. భారత మార్కెట్లో రూ. 20వేల లోపు లభించే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్‌ లిస్టు అందిస్తోంది. ఈ జాబితాలో Xiaomi 11i హైపర్‌ ఛార్జ్, Samsung Galaxy F23 స్మార్ట్‌ఫోన్ వంటి మరెన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Flipkart Big Billion Days Sale _ Best phone deals under Rs 20,000

Flipkart Big Billion Days Sale _ Best phone deals under Rs 20,000

రూ. 20వేల లోపు బెస్ట్ ఫోన్ డీల్స్ :
* 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌తో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ రూ. 24,999 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో మీరు రూ. 19,999 ధరతో పొందవచ్చు. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం (రూ. 1,500) డిస్కౌంట్ కూడా ఉంది. అదనంగా, ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై రూ. 3,500 డిస్కౌంట్ పొందుతారు. రెండు ఆఫర్లు ధరను రూ.19,999కి తగ్గించాయి.

* Realme 9 Pro+ డిస్కౌంట్ ధర రూ. 22,999 వద్ద అందుబాటులో ఉంది. రూ. 24,999 నుంచి ధర తగ్గింది. యూజర్లకు రూ.2వేల డిస్కౌంట్ లభిస్తోంది. ICICI బ్యాంక్, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3,000 ప్రీపెయిడ్ డిస్కౌంట్ ఆఫర్, 10 శాతం (రూ. 1,500) తగ్గింపు పొందవచ్చు. Realme 9 Pro+ (6GB + 128GB మోడల్) రూ. 18,499 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Flipkart Big Billion Days Sale _ Best phone deals under Rs 20,000

Flipkart Big Billion Days Sale _ Best phone deals under Rs 20,000

* Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో Samsung Galaxy F23 (4GB + 128GB మోడల్) రూ. 12,499కి అందుబాటులో ఉంది. కానీ, రూ. 10,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ. 1,500)గా ఉంది.

* Moto G52 కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. Flipkartలో రూ. 12,999 ప్రారంభ ధరతో పొందవచ్చు. ICICI బ్యాంక్ లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో ఈ Motorola ఫోన్‌ను రూ. 11,699 ధరతో పొందవచ్చు.

Flipkart Big Billion Days Sale _ Best phone deals under Rs 20,000

Flipkart Big Billion Days Sale _ Best phone deals under Rs 20,000

* Flipkart బిగ్ బిలియన్ రోజులలో Redmi Note 10 Pro Max ప్రారంభ ధర రూ. 17,999తో అందుబాటులో ఉంది. కానీ, రూ. 14,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI/Axis బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,500 డిస్కౌంట్, రూ. 1,500 ప్రీపెయిడ్ ఆర్డర్‌లు ఉన్నాయి.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైందోచ్.. ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!