Flipkart Hotel Booking : ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ బుకింగ్ ఫీచర్.. సరసమైన ధరకే ట్రావెల్ ఆప్షన్లు.. ప్రపంచంలో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు!

Flipkart Hotel Booking : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హాస్పిటాలిటీ రంగంలో సర్వీసులను మరింత విస్తరించనుంది. ఫ్లిప్‌కార్ట్ సొంత హోటల్ బుకింగ్ ఫీచర్‌ (Flipkart Hotel Booking Feature)ను ప్రారంభించింది.

Flipkart Hotel Booking : ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ బుకింగ్ ఫీచర్.. సరసమైన ధరకే ట్రావెల్ ఆప్షన్లు.. ప్రపంచంలో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు!

Flipkart Hotel Booking

Flipkart Hotel Booking : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హాస్పిటాలిటీ రంగంలో సర్వీసులను మరింత విస్తరించనుంది. ఫ్లిప్‌కార్ట్ సొంత హోటల్ బుకింగ్ ఫీచర్‌ (Flipkart Hotel Booking Feature)ను ప్రారంభించింది. భారతీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ పండుగ సీజన్, సెలవుల కన్నా అడ్వాన్స్ ట్రావెల్‌పై మరిన్ని డీల్స్ అందించడానికి ఫ్లిప్‌కార్ట్ హోటల్‌ (Flipkart Hotels)లను తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త హోటల్-బుకింగ్ ఫీచర్‌తో ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులను 3 లక్షల దేశీయ, విదేశీ హోటళ్లలో బుక్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ముఖ్యంగా, ఫ్లిప్‌కార్ట్ తన వాణిజ్య వ్యాపారాన్ని డిజిటల్ వాణిజ్యంలో విస్తరించేందుకు ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ క్లియర్‌ట్రిప్‌ను కొనుగోలు చేసింది.

ఇప్పుడు క్లియర్‌ట్రిప్ API సపోర్టుతో ఫీచర్ మరింత సరసమైన ధరకే ట్రావెల్ ఆప్షన్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ హోటల్‌లు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు బుకింగ్-సంబంధిత పాలసీలు, సులభమైన EMI ఆప్షన్లతో సహా యాడ్-ఆన్ బెనిఫిట్స్ అందిస్తోంది. క్లియర్‌ట్రిప్ API సపోర్టుతో ట్రావెల్ రంగాలపై ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ ఎంతో ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం ఈ కొత్త హోటల్ బుకింగ్ ఫీచర్ (Flipkart Hotel Booking) ఫ్లిప్‌కార్ట్ యాప్‌ (Flipkart App)లో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఆఫర్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల ద్వారా సకాలంలో కమ్యూనికేషన్‌ పొందవచ్చునని కంపెనీ పేర్కొంది.

Flipkart Hotel Booking

Flipkart Hotel Booking

ఫ్లిప్‌కార్ట్ హోటల్ బుకింగ్ సర్వీసు సమయంలో వినియోగదారు సంబంధిత విచారణలతో క్లయింట్‌లకు సాయం చేసేందుకు ప్రత్యేక కస్టమర్ కేర్ సర్వీసును కూడా Flipkart ఏర్పాటు చేసింది. అంతేకాదు.. ప్లాట్‌ఫారమ్‌లో థర్డ్ పార్టీ ఆఫర్‌లను యాక్సెస్ చేసేందుకు కూడా యూజర్లను అనుమతిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ వసతి మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుదలతో ఇప్పటివరకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి 2022 గొప్ప ఏడాదిగా చెప్పవచ్చు. ఎందుకంటే.. చాలామంది వినియోగదారులకు గమ్యస్థానాలు, వర్క్‌స్టేషన్‌లు, ఎక్కువసేపు బస చేయడం, వెకేషన్ రెంటల్స్ వంటి అవసరమవుతున్నాయని కంపెనీ వివరించింది.

మరోవైపు.. ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది, ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. ఈ సేల్ ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్, టీవీలు, ఇతర ప్రొడక్టులతో పాటు Realme, Poco, Vivo, Apple, Samsung వంటి అత్యధికంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. Flipkart 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్లను అందించడానికి ICICI, Axis బ్యాంకుతో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.

Read Also : Flipkart Electronics Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదిగో టాప్ 10 ఫోన్ డీల్స్ మీకోసం.. డోంట్ మిస్..!