iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై డిస్కౌంట్లు.. రాబోయే బిగ్ దీపావళి సేల్ పోస్టర్ లీక్..! ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

iPhone 13 Discount Sale Flipkart : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 30న ముగియనుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ దీపావళికి మరో సేల్‌ (Big Diwali Sale)ను నిర్వహించే అవకాశం ఉంది.

iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై డిస్కౌంట్లు.. రాబోయే బిగ్ దీపావళి సేల్ పోస్టర్ లీక్..! ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

Flipkart likely to offer discounts on iPhone 13 during Big Diwali sale, but do not fall for it

 iPhone 13 Discount Sale Flipkart : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 30న ముగియనుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ దీపావళికి మరో సేల్‌ (Big Diwali Sale)ను నిర్వహించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ తేదీలను అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు కానీ, అనుకోకుండా కొన్ని నిమిషాల పాటు ప్లాట్‌ఫారమ్‌లో కనిపించనుంది. రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ పోస్టర్ అనుకోకుండా లీక్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 5న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు కొనసాగనుంది.

Flipkart likely to offer discounts on iPhone 13 during Big Diwali sale, but do not fall for it

Flipkart likely to offer discounts on iPhone 13 during Big Diwali sale, but do not fall for it

టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ సేల్‌కు సంబంధించి ట్విట్టర్‌లో స్క్రీన్‌షాట్ పోస్ట్ చేశారు. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ కార్డ్‌లలో ఒకదానితో షాపింగ్ చేస్తే.. కొనుగోలుదారులు అన్ని రకాల ప్రొడక్టులపై10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. లీక్ అయిన పోస్టర్ ద్వారా.. ఫ్లిప్‌కార్ట్ రాబోయే బిగ్ దీపావళి సేల్ సందర్భంగా iPhone మోడల్‌లపై iPhone 13, iPhone 12 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ప్రస్తుతానికి ఎలాంటి డీల్స్ వెల్లడించలేదు. అయితే ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందించే అవకాశం ఉంది.

ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌డే సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లపై ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఐఫోన్ 13, ఇన్‌ఫాక్ట్, రూ. 47వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అంతేకాదు.. అత్యంత చౌకైనది కూడా. కానీ, బిగ్ బిలియన్ డేస్ సేల్ సమస్య ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్ ప్రతి గంటకు ప్రొడక్డులను ధరలను పెంచుతోంది. ఉదాహరణకు.. ఐఫోన్ 13 సేల్ ప్రారంభంలో రూ. 47,000కి అందుబాటులో ఉంది. ఒక గంట తర్వాత దాని ధర సుమారు రూ. 49,000కి పెరిగింది.

Flipkart likely to offer discounts on iPhone 13 during Big Diwali sale, but do not fall for it

Flipkart likely to offer discounts on iPhone 13 during Big Diwali sale, but do not fall for it

బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో మీరు ఐఫోన్ 13ని డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయకపోతే.. మీరు బిగ్ దీపావళి సేల్‌లో ప్రయత్నించవచ్చు కానీ చాలా మంది కొనుగోలుదారులకు నిరాశ ఎదురువుతుంది. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు ధరలను పెంచే అవకాశం ఉంది. ఈ సేల్ ప్రారంభమైనప్పుడు మీరు ఐఫోన్ 13ని త్వరగా బుక్ చేసుకుంటే మాత్రమే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ మోడల్‌ను ఎప్పుడూ తక్కువ ధరకు పొందవచ్చు. వచ్చే నెల బిగ్ దీపావళి సేల్‌లో అందుబాటులో ఉండే డీల్‌లను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు.

ప్లాట్‌ఫారమ్‌లో అన్ని సేల్స్ మాదిరిగానే, రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ కూడా ప్లస్ సభ్యుల (Plus Members) కోసం ఒక రోజు ముందుగానే ప్రారంభమవుతుంది. అన్ని డిస్కౌంట్ ఆఫర్‌లు ముందుగా ఈ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. మిగతా వారందరూ ఒక రోజు తర్వాత డీల్‌లకు యాక్సెస్ చేసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. క్రోమాలో దీపావళి సేల్.. ఇప్పుడే కొనేసుకోండి..!