Waayu Food Delivery App : స్విగ్గీ, జొమాటోకు పోటీగా.. సరికొత్త ఫుడ్ డెలివరీ Waayu యాప్‌.. తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ..!

Waayu Food Delivery App : కొత్త ఫుడ్ డెలివరీ యాప్ Waayu వచ్చేసింది. ఈ యాప్ వినియోగదారులకు సరసమైన ధరకే క్వాలిటీ ఫుడ్ డెలివరీ చేయనుంది. Waayu యాప్ సర్వీసులు ప్రస్తుతం ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Waayu Food Delivery App : స్విగ్గీ, జొమాటోకు పోటీగా.. సరికొత్త ఫుడ్ డెలివరీ Waayu యాప్‌.. తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ..!

Waayu Food Delivery App _ Suniel Shetty launches food delivery app, promises to offer food cheaper

Waayu Food Delivery App : ఫుడ్ డెలివరీకి బిజినెస్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. దేశ మార్కెట్లో ఇప్పటికే స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ఫుడ్ డెలివరీ యాప్ లు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఈ రెండింటికి పోటీగా మరో సరికొత్త ఫుడ్ డెలివరీ యాప్ మార్కెట్లోకి వచ్చేసింది. ఫుడ్ డెలివరీ కోసం ముంబై హోటల్స్ తమ సొంత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌తో ముందుకు వచ్చాయి.. అదే.. వాయు (Waayu) ఫుడ్ డెలివరీ యాప్.. ఈ యాప్‌ను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty) ప్రారంభించారు.

ఈ యాప్ ఇతర అగ్రిగేటర్‌ల కన్నా 15 నుంచి 20 శాతం చౌకగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. Waayu అనే పేరుతో వచ్చిన ఈ ఫుడ్ డెలివరీ యాప్ అధిక కమీషన్లు, ఫేక్ ర్యాంకింగ్‌, పెయిడ్ రివ్యూలు, నాణ్యత లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించనుంది. ప్రస్తుత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులతో రెస్టారెంట్‌లు, కస్టమర్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్ పరిష్కరిస్తుంది.

టెక్ వ్యవస్థాపకులు అనిరుధ కోట్‌గిరే (Anirudha Kotgire), మందార్ లాండే (Mandar Lande) స్థాపించిన డెస్టెక్ HORECA ప్రొడక్టుల్లో Waayu యాప్ ఒకటి. ముంబైకి చెందిన ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR), ఇతర పరిశ్రమ సంస్థల సపోర్టుతో మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS) అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోమ్, బనానా లీఫ్, శివ్ సాగర్, గురు కృపా, కీర్తి మహల్, పర్షియన్ దర్బార్, లడు సామ్రాట్‌లతో సహా వెయ్యి కన్నా ఎక్కువ ముంబై రెస్టారెంట్‌లతో కస్టమర్‌లను కనెక్ట్ చేస్తుంది.

Read Also : Google I/O 2023 : భారత్‌లో ఈరోజే గూగుల్ వార్షిక I/O 2023 ఈవెంట్.. ఏయే ప్రొడక్టులను లాంచ్ చేయొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

నివేదిక ప్రకారం.. WAAYU యాప్ రెస్టారెంట్‌ల నుంచి ఎలాంటి కమీషన్ రుసుములను వసూలు చేయదు. వినియోగదారులకు అత్యంత సరసమైన ధరకే ఫుడ్ డెలివరీ చేయనుంది. ఈ ప్లాట్‌ఫారమ్ యూజర్లకు సరసమైన ధర, సకాలంలో, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా క్లీన్ ఫుడ్, క్వాలిటీతో అందించనుంది. కంపెనీ ఫుడ్ డెలివరీ యాప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు, హోటల్ వ్యాపారి సునీల్ శెట్టిని నియమించుకుంది.

Waayu Food Delivery App _ Suniel Shetty launches food delivery app, promises to offer food cheaper

Waayu Food Delivery App _ Suniel Shetty launches food delivery app, promises to offer food cheaper

WAAYU యాప్ కమీషన్-రహిత మోడల్‌ ద్వారా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు తీసుకురానుందని వ్యవస్థాపకురాలు అనిరుధ కోట్‌గిరే చెప్పారు. ఇప్పటికే తమకు 16 ఆదాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు. రెస్టారెంట్‌లతో ప్రారంభ ధరతోనే భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఒక్కో ఔట్‌లెట్‌కి నెలకు వెయ్యి, ఆ తర్వాత, నెలకు 2వేలకు పెంచనుంది. పర్-ఆర్డర్ కు ఎలాంటి కమీషన్ లేదని తెలిపారు.

Waayu యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే? :
యాప్‌లో రెండు వెర్షన్‌లు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం వాయు డెలివరీ పార్టనర్ (Waayu Delivery Partner), కస్టమర్ల కోసం Waayu యాప్ వినియోగించుకోవచ్చు.

– Google Play Store నుంచి Waayu యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్‌లో waayu.app వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
– మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్‌తో Sign Up చేయండి లేదా Login చేయండి.
– మీ లొకేషన్ ఎంటర్ చేయండి లేదా మీ GPSని యాక్సెస్ చేసేందుకు యాప్‌ను అనుమతించండి.
– మీ లొకేషన్ డెలివరీ చేసే రెస్టారెంట్లు, మెనుల ద్వారా బ్రౌజ్ చేయండి.
– వంటకాలు, రేటింగ్, ధర లేదా ఆఫర్‌ల ద్వారా కూడా ఫిల్టర్ చేయవచ్చు.
– మీరు ఆర్డర్ చేసే వంటకాలను ఎంచుకుని, వాటిని మీ కార్ట్‌కు యాడ్ చేయండి.
– మీ ఆర్డర్‌ను ప్రాధాన్యతలు లేదా ప్రత్యేక సూచనలతో కస్టమైజ్ చేసుకోవచ్చు.
– మీ ఆర్డర్‌ని రివ్యూ చేశాక చెక్‌అవుట్‌కి వెళ్లండి.
– మీరు ఆన్‌లైన్‌లో లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు.
– మీరు ఏవైనా కూపన్ కోడ్‌లు లేదా డిస్కౌంట్‌లను కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
– మీ ఆర్డర్‌ను నిర్ధారించండి. రెస్టారెంట్ నుంచి నిర్ధారణ మెసేజ్ కోసం వేచి ఉండండి.
– యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీ ఆర్డర్ స్టేటస్, డెలివరీ టైమ్ అంచనాను కూడా ట్రాక్ చేయవచ్చు.
– డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి మీ ఆర్డర్‌ను స్వీకరించండి. మీ ఆహారాన్ని ఆస్వాదించండి.
– మీరు యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీ ఎక్స్ పీరియన్స రేట్ చేయవచ్చు. రివ్యూ కూడా ఇవ్వొచ్చు.

రిపోర్టు ప్రకారం.. ఈ యాప్ రెస్టారెంట్ యజమానులకు ఆన్‌లైన్ ఆర్డర్‌లపై మరింత సౌలభ్యాన్ని కంట్రోల్ అందిస్తుంది. UPI, Paytm, Google Pay, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల వంటి వివిధ మెథడ్‌లను ఉపయోగించి తమ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా పేమెంట్లు చేసుకోవచ్చు. గ్రాబ్, డన్జో వంటి ప్రాధాన్య డెలివరీ పార్టనర్లను కూడా ఎంచుకోవచ్చు. లేదంటే సొంత సిబ్బందిని కలిగి ఉండవచ్చు. ఈ యాప్ త్వరలో ప్రభుత్వ ONDC ప్లాట్‌ఫారమ్‌తో ఇంటిగ్రేట్ కానుంది. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించనుంది.

Read Also : ONDC App : కొత్త ONDC యాప్ వచ్చేసింది.. ఇక జొమాటో, స్విగ్గీతో పనిలేదు.. తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!