4G Jio Plans Offer : 5G సర్వీసులు కాదు.. ఈ జియో 4G ప్లాన్లపై అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ మరెన్నో ఆఫర్లు.. ఓసారి లుక్కేయండి..!

4G Jio plans Offer : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రధానంగా 4 నగరాల్లో (ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్‌కతా) 5G సర్వీసులను ప్రారంభించింది. అయితే ఇతర నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులు 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని పొందడానికి వచ్చే ఏడాది వరకు వేచి ఉండాలి.

4G Jio Plans Offer : 5G సర్వీసులు కాదు.. ఈ జియో 4G ప్లాన్లపై అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ మరెన్నో ఆఫర్లు.. ఓసారి లుక్కేయండి..!

Forget 5G, these 4G Jio plans offer free Netflix, unlimited calls and much more

4G Jio plans Offer : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రధానంగా 4 నగరాల్లో (ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్‌కతా) 5G సర్వీసులను ప్రారంభించింది. అయితే ఇతర నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులు 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని పొందడానికి వచ్చే ఏడాది వరకు వేచి ఉండాలి. ప్రస్తుతం, Jio అర్హత ఉన్న వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్ కింద 5G సర్వీసులను అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇంకా 5G ప్లాన్‌లను ప్రారంభించలేదు. 4 నగరాల్లోని వినియోగదారులు 4G ప్లాన్‌లతో 5Gని యాక్సెస్ చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో ప్రస్తుతం విభిన్న బెనిఫిట్స్‌తో కూడిన 4G ప్లాన్‌లను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన డేటాను అందించే జియో ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సబ్‌స్క్రిప్షన్‌లను అందించే ప్లాన్‌లు, డిస్నీ+ హాట్‌స్టార్ కూడా ఉన్నాయి. ఇటీవల, Jio దాని12 ప్రీపెయిడ్ ప్లాన్‌ల నుంచి Hotstar సబ్‌స్క్రిప్షన్‌లను తీసివేసింది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించే జియో ప్లాన్‌లను ఓసారి పరిశీలిద్దాం.

ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో 4G ప్లాన్‌లు :
రిలయన్స్ Jio రూ. 399 ప్లాన్ :
4G పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మొదటి బిల్లింగ్ సైకిల్‌కు మొత్తం 75 GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత ఒక్కో GBకి రూ.10 అదనంగా డేటా పొందవచ్చు. రోజుకు 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, Netflix, Amazon Prime, Disney+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.

Forget 5G, these 4G Jio plans offer free Netflix, unlimited calls and much more

Forget 5G, these 4G Jio plans offer free Netflix, unlimited calls and much more

Jio రూ. 599 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో 200GB డేటాతో పాటు ఆ తర్వాత GBకి రూ. 10 ఫ్లాట్ రేట్‌తో 100GB డేటా పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, ఫ్యామిలీ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, అదనపు జియో SIM కూడా పొందవచ్చు.

Jio రూ. 799 ప్లాన్ :
150GB డేటా బెనిఫిట్ క్యాప్‌తో.. ఈ ప్లాన్ 200GB డేటాను పొందవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ కింద మరో రెండు Jio SIMలను రూ. 10కి ఒక GB అందిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఫ్రీగా సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.

జియో రూ. 999 ప్లాన్ :
ఈ ప్లాన్ 1GBకి రూ. 10తో మొత్తం 200GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌లో ఫ్యామిలీ ప్లాన్ కింద 3 Jio సిమ్‌లు ఉంటాయి. Netflix, Amazon Prime, Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌లతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best Jio Plans : రూ. 500 లోపు బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. మరెన్నో బెనిఫిట్స్.. రోజుకు డేటా ఎంతంటే?