Google Gemini AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐని తలదన్నేలా గూగుల్ మల్టీ మోడల్ జెమిని.. టెక్ట్స్ మాత్రమే కాదు.. ఫొటోలను క్రియేట్ చేయగలదు..!
Google Gemini AI : గూగుల్ దిగ్గజం గూగుల్ I/O ఈవెంట్ సందర్భంగా (Bard AI)తో సహా పిక్సెల్ 7a, పిక్సెల్ Fold స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. టెక్ దిగ్గజం గూగుల్ జెమినీ మల్టీ మోడల్ ప్రత్యేకతలతో పాటు లేటెస్ట్ AI పురోగతిని కూడా ప్రదర్శించింది.

Forget Bard, Gemini will be Google’s response to ChatGPT and Bing AI
Google Gemini AI : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మే 10న జరిగిన (Google I/O) ఈవెంట్లో అనేక ఆసక్తికరమైన ప్రొడక్టులను తీసుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ Pixel 7a, Google Pixel Fold ఫోన్ ఆవిష్కరించింది. అంతేకాదు.. టెక్ దిగ్గజం లేటెస్ట్ AI పురోగతిని కూడా ప్రదర్శించింది. ఇందులో జెమిని (Gemini AI) అనే కొత్త భాషా మోడల్‌ను రిలీజ్ చేసింది.
ఇప్పటికే గూగుల్ బార్డ్ ఏఐ (Bard AI) కలిగి ఉండగా, జెమిని మల్టీ మోడల్‌ను ప్రత్యేక ఫీచర్లతో ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్లో అత్యంత పాపులర్ ఏఐ టూల్స్ ChatGPT, BingAI కన్నా మెరుగైన పర్ఫార్మెన్స్ కనబరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జెమిని మల్టీ మోడల్ తో కలిగే ముఖ్య ప్రయోజనం ఏంటో తెలుసా? మల్టీమోడల్ సామర్ధ్యం కలిగి ఉండటం.. గత ఏఐ మోడల్స్ కన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
జెమిని సామర్థ్యాలపై గూగుల్ వివరణ ఇదే :
ఈ మల్టీ మోడల్ జెమిని గురించి గూగుల్ వివరణ ఇచ్చింది. ‘ఇప్పటికే జెమినిపై పని చేస్తున్నాం. రాబోయే నెక్స్ట్ ఏఐ ‘జెమెని’ మల్టీమోడల్గా రూపొందుతోంది. ఈ టూల్ API ఇంటిగ్రేషన్లలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ టూల్ సాయంతో మెమరీ, ప్లానింగ్ వంటి భవిష్యత్తు ఆవిష్కరణలను ప్రారంభించవచ్చు. దీనిపై జెమిని ఇప్పటికీ ట్రైనింగ్‌లో ఉంది.

Forget Bard, Gemini will be Google’s response to ChatGPT and Bing AI
ఇంతకు ముందు మోడల్‌లలో ఎన్నడూ చూడని మల్టీమోడల్ సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది. సెక్యూరిటీ కోసం చక్కగా ట్యూన్ అయి ఉంటుంది. కఠినంగా టెస్టింగ్ చేసిన తర్వాత, జెమిని వివిధ ప్రొడక్టులు, అప్లికేషన్లు, ఇతర డివైజ్‌లలో ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం అమలు చేయొచ్చు. PalM 2 మాదిరిగా వివిధ సైజులు, సామర్థ్యాలలో అందుబాటులో ఉంటుంది’ అని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
చాట్‌జీపీటీ, బింగ్ ఏఐ కన్నా జెమిని ఎందుకు మెరుగైనది?
జెమిని ఏఐ టూల్ ‘మల్టీమోడల్’ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ టూల్ మల్టీమోడల్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అంటే.. టెక్స్ట్, కోడ్, ఇమేజ్‌లను అర్థం ఈజీగా చేసుకోగలదు. అన్నింటిని ఒకేసారి రూపొందించే సామర్థ్యం ఉంది. ChatGPT అనేది టెక్స్ట్-ఓన్లీ మోడల్.. అంటే.. ఇది కేవలం టెక్స్ట్‌ను మాత్రమే అర్థం చేసుకోగలదు.. అలాగే రూపొందించగలదు. అదే జెమిని టూల్ ChatGPT కన్నా అన్ని రకాల పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలదు.
ఉదాహరణకు.. జెమిని ఏఐ టూల్.. టెక్స్ట్, ఇమేజ్‌లు రెండింటినీ అర్థం చేసుకోగలదు. ఏదైనా కొత్త రకం AI టూల్ పవర్డ్ చాట్‌బాట్‌ను రూపొందించాలంటే జెమిని టూల్ వినియోగించవచ్చు. అదేవిధంగా, Bing AI ఇమేజ్ క్రియేషన్ కోసం స్పెషల్ లింక్‌ను కలిగి ఉంది. కానీ, చాట్‌బాక్స్‌లో ఫొటోలు క్రియేట్ చేయమని బింగ్ AI చాట్‌బాట్‌ని అడగలేరు. ఎందుకంటే.. ఈ బింగ్ ఏఐ కూడా కేవలం టెక్స్ట్ మాత్రమే క్రియేట్ చేయగలదు.

Forget Bard, Gemini will be Google’s response to ChatGPT and Bing AI
ChatGPT కన్నా విస్తృత శ్రేణి ఉత్పత్తులు, యాప్‌లకు శక్తిని అందించడానికి జెమిని ఏఐని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు.. గూగుల్ సెర్చ్ కొత్త వెర్షన్‌ను మరింత సమర్థవంతంగా పనిచేసేలా జెమిని ఉపయోగించవచ్చు. కొత్త రకం AI- పవర్డ్ వర్చువల్ అసిస్టెంట్‌ని క్రియేట్ చేయడానికి జెమినిని ఉపయోగించవచ్చు. ChatGPT, BingAIలో ఈ సామర్థ్యాలన్నీ లేవు. అయితే, GPT 5 లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ChatGPT, ఇతర చాట్బాట్లను స్మార్ట్‌గా మార్చగలదు. ఈ GPT 5 లాంగ్వేజ్ మోడల్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు.
మెమెరీ, ప్లానింగ్ వంటి సామర్థ్యాలతో జెమిని వస్తుందని అంటున్నారు. అంటే.. ChatGPTతో సాధ్యం కాని కొత్త రకాల AI- పవర్డ్ అప్లికేషన్లను రూపొందించడానికి జెమెనిని వినియోగించవచ్చు. ఉదాహరణకు, మీ ప్రాధాన్యతలను గుర్తుంచు కోవడానికి, మీ రోజును ప్లాన్ చేయడంలో సాయపడే AI- పవర్డ్ పర్సనల్ అసిస్టెంట్‌ని క్రియేట్ చేయడానికి జెమినిని ఉపయోగించవచ్చు. కానీ, ప్రస్తుతానికి, జెమిని పబ్లిక్‌గా అందుబాటులోకి రావడానికి మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..