Apple iPhone 14 Series: ఆపిల్ ఐఫోన్ 14 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది

ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి తీసుకుని రావడంలో ఆపిల్ సంస్థ బిజీగా ఉంది. సరిగ్గా ఐఫోన్ 13 మార్కెట్లోకి వచ్చేముందే ఐఫోన్ 14కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.

Apple iPhone 14 Series: ఆపిల్ ఐఫోన్ 14 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది

Iphone 14 (1)

Apple iPhone 14 Series: ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి తీసుకుని రావడంలో ఆపిల్ సంస్థ బిజీగా ఉంది. సరిగ్గా ఐఫోన్ 13 మార్కెట్లోకి వచ్చేముందే ఐఫోన్ 14కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఐఫోన్ 14 ప్రో మాక్స్ అని పిలిచే ప్రధాన డిజైన్ మార్పులతో కనిపిస్తోంది. పంచ్-హోల్ నాచ్ డిస్‌ప్లే ఇందులో ప్రత్యేక ఆకర్షణ. నాచ్ వచ్చే ఏడాది మోడల్‌లో కనిపించవచ్చు. వాటి ధరలు, ఫీచర్లు గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

చైనాలో యాపిల్‌ ఐఫోన్‌ అమ్మకాలు జరిపే సంస్థల నుంచి సమాచారం లీక్ అయినట్లుగా తెలుస్తోంది. 2022లో ఐఫోన్‌ 14 సిరీస్‌‌లో మూడు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన యాపిల్‌ -14సిరీస్‌లోని ఓ మోడల్‌ ఫోన్‌ 120హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే, మరో ఫోన్‌ 60హెచ్‌జెడ్‌ ఎల్‌టిపిఎస్ ఓఎల్‌ఇడి డిస్‌ప్లేతో రాబోతుంది. ఐఫోన్ 14 సిరీస్ బేసిక్‌ ఫోన్‌ ఐఫోన్ 14మినీ 60హెచ్‌ స్క్రీన్‌తో విడుదల అవ్వనుంది. ఐఫోన్‌ 13 ధరల కంటే ఐఫోన్‌ 14సిరీస్‌ ఫోన్ తక్కువ ధరకే లభ్యం అయ్యే పరిస్థితి ఉంది.

ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ విడుదల ఎప్పుడంటే?
యాపిల్‌ సంస్థ ఐఫోన్‌-14 మోడల్‌ ఫోన్లను 2022లో విడుదల చేస్తాయి. ఐఫోన్ 14 మోడల్స్‌లో ఆపిల్ ఏ16 చిప్‌సెట్, ప్రొటెక్షన్ కోసం ఫేస్‌ఐడీ, టచ్‌ ఐడి ఫీచర్లు ఉండనున్నాయి. ఐఫోన్‌ 14ఫోన్‌ మోడళ్ల ఎల్‌టీపీఓ (A low-temperature polycrystalline oxide (LTPO) display) డిస్‌ ప్లే తయారీ కోసం ఎల్జీతో చేతులు కలపుతోంది.

ఇది కాకుండా, ఐఫోన్ 14 టైటానియం మెటల్ రైల్ మరియు రౌండ్ వాల్యూమ్ బటన్‌లతో చూడవచ్చు. డిజైన్ 2010లో విడుదలైన ఐఫోన్ 4 మాదిరిగానే ఉంటుంది. ఆపిల్ పూర్తిగా పోర్ట్-లెస్‌గా వెళ్లవచ్చు లేదా భవిష్యత్ ఐఫోన్‌లలో USB-C ని ప్రవేశపెట్టవచ్చని అంటున్నారు. రెండర్‌ల ప్రకారం, Apple iPhone 14ని లైట్‌నింగ్ పోర్ట్‌తో అందించే అవకాశం ఉంది.

ఐఫోన్ 14 హార్డ్‌వేర్ సమాచారం ఇంకా అందుబాటులో లేదు. అయితే, మునుపటి లీక్‌లు ఐఫోన్ 14 లైనప్‌లో 6.1-అంగుళాలు మరియు 6.7-అంగుళాల ఫోన్‌లు ఉంటాయి. టిప్‌స్టర్ ప్రకారం, ప్రో మోడల్ కొత్త 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది, ఇది 12 మెగాపిక్సెల్ పిక్సెల్ బిన్డ్ ఇమేజ్‌లను ఉత్పత్తి చేయగలదు. ఈ కెమెరా 8కె వీడియో షూట్ చేయగలదు. ఐఫోన్ 14 ధర రూ.89,990 వరకు ఉంటుంది.