Free Public WiFi: పబ్లిక్ వైఫై ఫ్రీగా వాడేస్తున్నారా.. పర్సనల్ డేటా లూటీయే

ఉచిత యాక్సెస్ కూడా దొరుకుతుంది. చిన్న కాఫీ షాపుల నుంచి హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టూరిస్ట్ స్పాట్లలో ఫ్రీ వైఫై ..

Free Public WiFi: పబ్లిక్ వైఫై ఫ్రీగా వాడేస్తున్నారా.. పర్సనల్ డేటా లూటీయే

Free Public Wifi Poses Threat To Personal Data

Free public WiFi: ఇంటర్నెట్ ప్రతి చోటా అందుబాటులో ఉంటుంది. కొన్ని చోట్ల ఉచిత యాక్సెస్ కూడా దొరుకుతుంది. చిన్న కాఫీ షాపుల నుంచి హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టూరిస్ట్ స్పాట్లలో ఫ్రీ వైఫై దొరుకుతుంది కదా అని వాడేస్తే మీ స్మార్ట్ ఫోన్ లేదా, ల్యాప్ టాప్ లో డేటా అంతే లూటీ అయిపోయినట్లే.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అన్ సెక్యూర్డ్ నెట్ వర్క్ లలో లాగిన్ అయితే ఇలాంటి సమస్యలే వచ్చిపడతాయని.. చెప్తున్నారు. పాస్ వర్డ్ లేదా లాగిన్ కోసం ఏదైనా క్రెడెన్షియల్ ఉండాలి అలా లేకుండా లీగల్ టెర్మ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మీ డేటా మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం.

ఈ మేరకే పోలీసులు అటువంటి కనెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పబ్లిక్ వైఫై వాడేటప్పుడు అలర్ట్ గా ఉండాలి. బ్యాంకింగ్ సర్వీసులు లాంటివి ఇటువంటి వైఫైలతో లాగిన్ చేయకూడదు.

పర్సనల్ బ్యాంక్ అకౌంట్లను యాక్సెస్ చేయొద్దు. అన్ సెక్యూర్డ్ నెట్ వర్క్ లలో సెన్సిటివ్ పర్సనల్ డేటాను అప్ లోడ్ చేసుకోవద్దు. పబ్లిక్ వైఫైలతోనే లాగిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి.

ట్రావెలింగ్ లో ఉన్న సమయంలో మీ గ్యాడ్జెట్స్ ఆటోమేటిక్ కనెక్టివిటీ ఆఫ్ చేయండి. పబ్లిక్ ప్లేసుల్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా పెను ప్రమాదమే తెచ్చిపెడుతుంది. హ్యాకర్లు బ్లూటూత్ సిగ్నల్స్ ఓపెన్ గా ఉన్న డివైజ్ లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మీ డివైజ్ బ్లూటూత్ కనెక్షన్ ఆఫ్ చేయడం మర్చిపోకండి.

మీ అకౌంట్లలో నుంచి డబ్బులు అనుమానస్పదంగా డ్రా అయిపోతే అలర్ట్ అవమని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.