GB WhatsApp: జీబీ వాట్సప్ తీసేయడమే బెటరా..

ఆన్‌లైన్‌లోనూ.. ఓవర్ స్మార్ట్ గా ఆలోచించే వాళ్లూ.. జీబీ వాట్సప్ గురించి మాట్లాడుతుంటారు. అఫీషియల్ వాట్సప్ కంటే చాలా ఎక్కువ ఫీచర్లు అందులో ఉన్నాయని చెబుతుంటారు.

GB WhatsApp: జీబీ వాట్సప్ తీసేయడమే బెటరా..

Gb Whatsapp

GB WhatsApp: ఆన్‌లైన్‌లోనూ.. ఓవర్ స్మార్ట్ గా ఆలోచించే వాళ్లూ.. జీబీ వాట్సప్ గురించి మాట్లాడుతుంటారు. అఫీషియల్ వాట్సప్ కంటే చాలా ఎక్కువ ఫీచర్లు అందులో ఉన్నాయని చెబుతుంటారు. కానీ, అదెంతవరకూ సేఫ్ అనే విషయం ఆలోచించారా..

వాట్సప్ లో ప్రైవసీ సెట్టింగ్స్ రావడానికి ముందు వచ్చింది జీబీ వాట్సప్. ఆ తర్వాత వచ్చిన వెర్షన్లలో పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్ రీడ్ రెసిప్ట్స్, ప్రత్యేకించి కొన్ని కాంటాక్టులను దూరంగా ఉంచడం, గ్రూపులకు పెద్ద పేర్లు పెట్టుకోగలగడం వంటివన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. కొన్ని మాడిఫైడ్ వెర్షన్లలో అయితే వాట్సప్ మెసేజ్ బ్రాడ్‌కాస్ట్ లిమిట్ 250 యూజర్ల నుంచి 600 యూజర్లకు పెంచుకోవచ్చు కూడా.

ఈ జీబీ వాట్సప్ వెర్షన్ లో మాత్రం ఆటో రిప్లై ఇవ్వడానికి ఒక్కో మెసేజ్ కు విడివిడిగా ఇవ్వాలి. ఈ వెర్షన్ వాడుతున్న కొందరిలో అఫీషియల్ వాట్సప్ ఫీచర్లు కూడా పూర్తిగా తెలియకపోవచ్చు.

ఇది గూగుల్ ప్లే స్టోర్ లో గానీ, ట్రస్ట్ వర్తీ యాండ్రాయిడ్ యాప్ స్టోర్స్ లో అయినా దొరక్కపోవచ్చు. చాలా ఫోన్లలో ఈ ఏపీకే ఫైల్స్ మాల్ వేర్ ను ప్రొడ్యూస్ చేసి స్మార్ట్ ఫోన్ ను హై రిస్క్ లో పెట్టే అవకాశం కూడా ఉంది. చాలా మంది ఇతరుల కంటే ఎక్కువ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయనుకుని తమ ఫోన్లను ఎక్కువ రిస్క్ లో పెట్టుకుంటున్నారు. అది మీ ప్రైవసీకి కూడా ప్రమాదమే.

వాట్సప్ థర్డ్ పార్టీ మాడ్స్ ను నిషేదించింది. ఇతర అకౌంట్లను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. జీబీ వాట్సప్ లో ఆ సెక్యూరిటీ ఉండదు.