Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!

జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ ఐడీ.5ను కారును ఆవిష్కరించింది. ఈ కారును ఐడీ.4ని ప్రేరణ తీసుకొని రూపొందించినట్లు తెలుస్తుంది.

Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!

Electric Car

Electric Car :  కొత్త వాహనాలు కొనాలి అనుకునేవారు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టి పెడుతున్నారు. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో కార్ల తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా ఎలక్ట్రిక్ కార్లను డిసైన్ చేస్తున్నాయి. అధిక మైలేజ్, ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇక జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ ఐడీ.5ను కారును ఆవిష్కరించింది. ఈ కారును ఐడీ.4ని ప్రేరణ తీసుకొని రూపొందించినట్లు తెలుస్తుంది. వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్, జీటిఎక్స్ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ మూడు విభిన్న పవర్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

చదవండి : Electric Car : సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు..ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం

ఈ కారు 77 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ వేరియెంట్లు రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్లతో రానున్నాయి. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ రెండూ గంటకు 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కలిగి ఉంటాయి. ప్రో పెర్ఫార్మెన్స్ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు వెల్లగలదని సంస్థ పేర్కొంది. ఐడీ 5 ప్రో 10.4 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ప్రో పెర్ఫార్మెన్స్ పవర్ అవుట్ పుట్ 201 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఇది 8.4 సెకన్లలో గంటకు 0-96 కిలోమీటర్లవేగాన్ని వేగవంతం చేయగలదు.

చదవండి : Electric Scooter : రూ. 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు

మరొకారు వోక్స్ వ్యాగన్ ఐడీ 5 జీటీఎక్స్ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల డ్యూయల్ మోటార్‌తో వస్తుంది. ఇది గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 6.3 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 480 కిలోమీటర్లవరకు వెళ్ళవచ్చు. ఇవి 2022లో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.