ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సర్వీసులు..

  • Published By: sreehari ,Published On : August 20, 2020 / 01:49 PM IST
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సర్వీసులు..

Gmail, Google Drive, Google Docs మరియు ఇతర Google సేవలు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వీసులన్నింటిని అంతరాయం కలిగింది. గూగుల్ అందించే చాలా సర్వీసులు డౌన్ అయ్యాయి. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్ సహా ఇతర గూగుల్ సర్వీసులన్నీ డౌన్ అయ్యాయని నివేదిక వెల్లడించింది.



ప్రపంచంలో చాలామంది గూగుల్ యూజర్లు సమస్యను ఎదుర్కొన్నారని తెలిపింది. సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు Gmail ద్వారా ఈమెయిల్‌లను పంపడం, గూగుల్ డిస్క్‌లో ఫైల్‌లను అప్‌లోడ్ చేయడం వంటి సమస్యలను నివేదిస్తున్నారు.



కొంతమంది యూజర్లు గూగుల్ డాక్స్, గూగుల్ మీట్‌ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. గూగుల్ తమ సర్వీసులపై అంతరాయాలకు గల కారణాలను గుర్తించే పనిలో ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన వివరాలను అందించలేదు. ట్విట్టర్‌లో యూజర్ల నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు తమ ఇమెయిల్‌లను Gmail లో యాక్సెస్ చేయలేరు.



కొంతమంది యూజర్లు తమ ఈమెయిల్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదించారు. #Gmail అనే హ్యాష్‌ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో అవుతోంది. Gmailకు అటాచ్‌మెంట్లు లేదా గూగుల్ డ్రైవ్‌కు డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.



డౌన్‌టైమ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ DownDetector వివరాల ప్రకారం.. ఉదయం 9:30 గంటలకు ISTలో Gmail అంతరాయంపై పలు నివేదికలు వచ్చాయి.
డౌన్‌డెక్టర్ సైట్‌లో లభించే మ్యాప్ సమస్యలు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కాదని భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని యూజర్లను ప్రభావితం చేస్తున్నాయని చూపించింది.


Gmailతో పాటు , G-Suit స్టేటస్ డాష్‌బోర్డ్ ప్రకారం.. గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ మీట్‌తో సహా గూగుల్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. యూజర్లు చాలా మంది గూగుల్ డ్రైవ్‌లో ఫైల్‌లను అప్‌లోడ్ చేయడం, గూగుల్ డాక్స్‌లో కంటెంట్ రాయడం లేదా గూగుల్ మీట్ ఉపయోగించి వీడియో కాల్స్ చేసినవారిలో సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై గూగుల్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.