జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు

గూగుల్ అసిస్టెంట్ వాడే ఇండియన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే గూగుల్ అసిస్టెంట్ లో ఏడు కొత్త దేశీయ భాషలు యాడ్ అయ్యాయి.

  • Published By: sreehari ,Published On : February 25, 2019 / 11:45 AM IST
జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు

గూగుల్ అసిస్టెంట్ వాడే ఇండియన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే గూగుల్ అసిస్టెంట్ లో ఏడు కొత్త దేశీయ భాషలు యాడ్ అయ్యాయి.

గూగుల్ అసిస్టెంట్ వాడుతున్న ఇండియన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే గూగుల్ అసిస్టెంట్ లో ఏడు కొత్త దేశీయ భాషలు యాడ్ అయ్యాయి. అందులో తెలుగు, తమిళ్, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఉర్దూ భాషలు ఉన్నాయి. గత ఏడాదిలో గూగుల్ అసిస్టెంట్ మరాఠి భాషను యాడ్ చేసింది. ఈ ఏడాది గూగుల్.. తెలుగు సహా ఏడు భాషలను అసిస్టెంట్ యాప్ లో చేర్చింది. గూగుల్ అసిస్టెంట్ లో లాంగ్వేజీ ఆప్షన్ మార్చుకునే సదుపాయం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మీకు కావాల్సిన భాషలోకి మార్చుకునేందుకు ఈ యాప్ సులభంగా ఉంటుంది.

ఉదాహరణకు.. తెలుగు యూజర్లు.. ‘Ok Google, talk to me in Telugu’అని మాట్లాడితే చాలు.. వెంటనే తెలుగు భాషలోకి మారిపోతుంది. అంతేకాదు.. గూగుల్ మరో ఆప్షన్ కూడా యాడ్ చేసింది. వాయిస్ టైపింగ్ KaiOS ఆపరేటింగ్ సిస్టమ్ ను యాడ్ చేసింది.  ఈ ఆప్షన్ రిలయన్స్ జయో, జియో ఫోన్ 2 స్మార్ట్ ఫీచర్ ఫోన్లపై మాత్రమే పనిచేస్తుంది. ఈ ఫీచర్ సాయంతో.. యూజర్లు మాట్లాడే మాటలను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేస్తుంది. అయితే మాట్లాడే పదాలు న్యాచురల్, సరైన ఉచ్ఛారణ పలకాలని గూగుల్ పేర్కొంది. 
Read Also: సమ్మర్ స్మార్ట్ ట్రెండ్ : కొత్త 5G స్మార్ట్ ఫోన్లు ఇవే

KaiOS ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే గూగుల్ అసిస్టెంట్ బటన్ పై ప్రెస్ చేయండి. కాసేపు అలానే నొక్కి ఉంచండి. వాయిస్ కమాండ్ తో టెక్ట్స్ మెసేజ్ లు, వెబ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఫీచర్ల ఫోన్లు వాడే యూజర్లు.. తమ ఫోన్ లోని మెనూ, సెట్టింగ్స్ ను ఇంగ్లీష్ నుంచి మరో భాషలోకి మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ యాప్ పై కావాల్సిన భాషలో మాట్లాడాలి. ఇంగ్లీష్ భాష కావాలంటే.. KaiOS ఫోన్ లాంగ్వేజ్ ను ఇంగ్లీష్ లో సెట్ చేయండి.

లేదంటే.. ఏడు భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు అని గూగుల్ తెలిపింది. మెసేజ్ లు, గూగుల్ మ్యాప్స్, వాయిస్ టైపింగ్ ఆన్ KaiOS, వాయిస్ కంట్రోల్స్, ఫిజికల్ బటన్లు అన్నీ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ పై పనిచేస్తాయి. మీ అవసరానికి తగినట్టుగా గూగుల్ అసిస్టెంట్ సర్వీసు పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ గో (పై), KaiOS ఫోన్లపై Actions ఆప్షన్ ను త్వరలో డెవలపర్లు రిలీజ్ చేయనున్నట్టు గూగుల్ ప్రకటించింది. ప్రత్యేకించి ఈ ఫీచర్లు ఇండియాలోని క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.  
Read Also: ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ నిజమేనా?