ఆండ్రాయిడ్ లో ‘గూగుల్ అసిస్టెంట్’ ఇంటిగ్రేషన్ 

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ స్మార్ట్ అసిస్టెంట్ సేవలను మరింత విస్తరిస్తోంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో...

  • Published By: sreehari ,Published On : February 26, 2019 / 12:26 PM IST
ఆండ్రాయిడ్ లో ‘గూగుల్ అసిస్టెంట్’ ఇంటిగ్రేషన్ 

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ స్మార్ట్ అసిస్టెంట్ సేవలను మరింత విస్తరిస్తోంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో…

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ అసిస్టెంట్ సేవలను మరింత విస్తరిస్తోంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో స్మార్ట్ అసిస్టెంట్ ఆప్లికేషన్ ఇంటిగ్రేట్ చేస్తోంది. మ్యాప్స్, టెక్స్ట్ మెసేజ్, రెస్టారెంట్లు, వెదర్ రిపోర్ట్, మూవీలు ఏ ఇన్మరేషన్ అయిన స్మార్ట్ అసిస్టెంట్ టూల్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఇప్పటివరకూ గూగుల్ అసిస్టెంట్ టూల్ ను మెసేజింగ్ యాప్ ఇంటిగ్రేషన్ చేయగా.. ఇంగ్లీష్ భాషలో మాత్రమే పనిచేస్తుంది.
Also Read : జియో ఎఫెక్ట్ : వోడాఫోన్ రివైజడ్ రీఛార్జ్ ప్లాన్

రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ అసిస్టెంట్ ఆప్లికేషన్ టూల్  ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పని చేయనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. గూగుల్ టెక్స్ట్, చాట్ ఆప్లికేషన్ మెసేజ్ లను ఆండ్రాయిడ్ ఫోన్లలో పంపొచ్చు. గూగుల్ స్మార్ట్ అసిస్టెంట్ ఆప్లికేషన్ టూల్.. మీ ఆండాయిడ్ ఫోన్లో ఉంటే చాలు.. టెక్స్ట్ మెసేజ్, ఫొటోలు, ఆడియో మెసేజ్ లను పంపొచ్చు. కన్వరేజషన్స్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సెర్చ్ చేయొచ్చు. 

ఈ యాప్ ద్వారా మీ ఫోన్లో రెస్టారెంట్ల సమాచారం, కొత్త మూవీల ఇన్మరేషన్ తో పాటు వెదర్ సమాచారాన్ని కూడా కన్వరేజషన్ తో తెలుసుకోవచ్చు. గూగుల్ స్మార్ట్ అసిస్టెంట్ టూల్ లో మరో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. సజషన్ చిప్స్. అసిస్టెంట్ లోగాతో టెక్స్ట్ బాక్స్ పై కన్వరేజషన్ థ్రెడ్ కనిపిస్తుంది. టాపిక్ ను బట్టి ఆటోమాటిక్ గా రిలేటడ్ ఇన్మరేషన్ డిసిప్లే అవుతుంది. ఈ ఫీచర్ పై ప్రైవసీ విషయంలో గూగుల్ క్లారిటీ ఇచ్చింది.

ఈ టూల్ ద్వారా మీ కన్వరేజేషన్ మెసేజ్ ను అసిస్టెంట్ రీడ్ చేయదని తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ లో మూవీలు, రెస్టారెంట్లు, వెదర్ ఇన్మరేషన్ మాత్రమే రిలేటెడ్ టాఫిక్స్ మాత్రమే డిటెక్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ గూగుల్ మెసేజింగ్ యాప్ ఆల్లో పై మాత్రమే అసిస్టెంట్ టూల్ పనిచేసేది. ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా మెసేజింగ్ టెక్స్టింగ్ యాప్ ను గూగుల్ అందించనుంది.