ప్లే స్టోర్ నుంచి 11యాప్‌లను తొలగించిన గూగుల్..

  • Published By: vamsi ,Published On : July 11, 2020 / 07:08 AM IST
ప్లే స్టోర్ నుంచి 11యాప్‌లను తొలగించిన గూగుల్..

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం దాని ప్లాట్‌ఫామ్‌లను మరింత సురక్షితంగా ఉంచే చర్యలను బలోపేతం చేస్తూ, గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 11 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఈ యాప్‌లన్నింటిలో జోకర్ మాల్‌వేర్‌ అనే వైరస్‌ను గూగుల్ గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెక్‌ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది.

యాజర్ల భద్రతాపరంగా మరింత మెరుగైన సేవలు అందిచడంలో భాగంగా గూగుల్‌ సంస్థ ప్లేస్టోర్‌ నుంచి ఈ 11 యాప్‌లను తొలగించింది. అందేతకాదు ఈ యాప్‌లను ఇప్పటికే వాడుతున్న వినియోగదారులు కూడా వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని వారు సూచనలు చేసింది.

ఈ మాల్వేర్ యూజర్లకు తెలియకుండానే ప్రీమియం సేవలకు సభ్యత్వాన్ని పొందగలదు. మరియు యూజర్లు వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లలోకి ప్రవేశించినప్పుడు, వాటిని Google Play ప్రొటెక్షన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కూడా గుర్తించలేదని తెలిపారు.

జోకర్ మాల్వేర్ కారణంగా తొలగించిన యాప్‌ల పూర్తి లిస్ట్ ఇదే:

com.imagecompress.android
com.contact.withme.texts
com.hmvoice.friendsms
com.relax.relaxation.androidsms
com.cheery.message.sendsms (two different instances)
com.peason.lovinglovemessage
com.file.recovefiles
com.LPlocker.lockapps
com.remindme.alram
com.training.memorygame

ఇమేజ్ ఎడిటర్లు, వీడియో ఎడిటర్లు, వాల్‌పేపర్ అనువర్తనాలు, ఫ్లాష్‌లైట్ యాప్‌లు, ఫైల్ మేనేజర్లు మరియు మొబైల్ గేమ్‌ యాప్‌లకు యూజర్ల నుంచి ఎక్కువ ఆదరణ ఉండటంతో అటువంటి వాటి నుంచే మాల్‌వేర్‌ వ్యాప్తి జరుగుతుందని పలు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.