Google Bans Ads: గూగుల్ కొత్త పాలసీ.. ఇలా చేస్తే మానిటైజేషన్ పోతుంది.. జాగ్రత్త!

వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది గూగుల్‌ సంస్థ.

Google Bans Ads: గూగుల్ కొత్త పాలసీ.. ఇలా చేస్తే మానిటైజేషన్ పోతుంది.. జాగ్రత్త!

Google (1)

Google Bans Ads: వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది గూగుల్‌ సంస్థ. తన ప్రకటనదారులు, ప్రచురణకర్తలు, YouTube సృష్టికర్తల కోసం కొత్త మానిటైజేషన్ పాలసీని ప్రకటించింది గూగుల్.

వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది గూగుల్‌ తన ప్లాట్‌ఫామ్స్‌పై శీతోష్ణస్థితి మార్పు గురించి చేసే తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేయాలని, తప్పుడు వాతావరణం నివేదికలు ఇచ్చి సంపాదించేవారి సమాచారాన్ని నిలిపివేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇటీవలి సంవత్సరాలలో, వాతావరణ మార్పుల గురించి తప్పుడు క్లెయిమ్‌లు ఎక్కువయ్యాయని, తప్పుడు క్లెయిమ్‌లను ప్రోత్సహించే ప్రకటనల గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ క్రమంలోనే ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్.

వాతావరణ మార్పు లేదా గ్రీన్‌హౌస్‌ వాయువుల వల్ల ప్రమాదం లేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. వీరు తమ వాదనలకు అనుకూలంగా వీడియోలను, ప్రకటనలను రూపొందిస్తున్నారు. వీటిపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గూగుల్ యూజర్లు. ఇలాంటివాటిని నిరోధించాలని కంపెనీ నిర్ణయించుకుంది.

ఈ మార్పు అమలుకు కంపెనీ ఆటోమేటెడ్‌ టూల్స్‌ను ఉపయోగించనున్నట్లు కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. Google ప్రకటనకర్తలు, ప్రచురణకర్తలు, YouTube సృష్టికర్తల కోసం కొత్త మానిటైజేషన్ పాలసీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకుని రానున్నట్లు చెప్పారు.

ఈ కొత్త పాలసీకి వ్యతిరేకంగా కంటెంట్‌ను తయారుచేస్తే జాగ్రత్తగా పరిశీలించి, మానిటైజేషన్‌ను కూడా ఆపివేసే పరిస్థితి ఉంటుందని గూగుల్ తెలిపింది.