Chrome New Shortcuts : గూగుల్ క్రోమ్‌లో సరికొత్త షార్ట్‌కట్స్.. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయా తెలుసా? ఇప్పుడే ట్రై చేయండి..!

Chrome New Shortcuts : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్ల కోసం సరికొత్త అప్‌‌డేట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. టెక్నాలజీ దిగ్గజం అడ్రస్ బార్ నుంచి బుక్‌మార్క్‌లు (Bookmarks), ట్యాబ్‌ (Tabs)లు, హిస్టరీ (History) కోసం కొత్త సెర్చ్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

Chrome New Shortcuts : గూగుల్ క్రోమ్‌లో సరికొత్త షార్ట్‌కట్స్.. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయా తెలుసా? ఇప్పుడే ట్రై చేయండి..!

Google Chrome brings new shortcuts for history, tabs, bookmarks_ How it works

Chrome New Shortcuts : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్ల కోసం సరికొత్త అప్‌‌డేట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. టెక్నాలజీ దిగ్గజం అడ్రస్ బార్ నుంచి బుక్‌మార్క్‌లు (Bookmarks), ట్యాబ్‌ (Tabs)లు, హిస్టరీ (History) కోసం కొత్త సెర్చ్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఆసక్తికరంగా, ఈ బ్రౌజర్ మూడు కొత్త ‘@’ షార్ట్‌కట్‌లను తీసుకువచ్చింది. అందులో @tabs, @bookmarks వంటి Chrome కోసం @History వంటివి షార్ట్‌కట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో Tab, History లేదా బుక్‌మార్క్‌ను సెర్చ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. @tabs పెద్ద సంఖ్యలో ట్యాబ్‌లను ఎంచుకునేందుకు యూజర్లకు సాయపడుతుంది.

వినియోగదారులు ఒక నిర్దిష్ట ట్యాబ్ కోసం క్షణాల్లో సెర్చ్ చేసేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులు అడ్రస్ బార్‌లో @tabs అని టైప్ చేయవచ్చు. లేదంటే.. డ్రాప్ డౌన్ మెను నుంచి ‘Search Tabs’ ఆప్షన్ ఎంచుకోవచ్చు లేదా Tab Keyని నొక్కండి. త్వరలో, అడ్రస్ బార్‌లో Search Tab అనే ట్యాగ్ కనిపిస్తుంది.

అదనంగా, @bookmarks @tabs లాగానే పని చేస్తాయి. అయితే, సేవ్ చేసిన బుక్‌మార్క్‌లను గుర్తించేందుకు ఈ షార్ట్ కట్ రిలీజ్ చేసింది. వినియోగదారు నిర్దిష్ట బుక్‌మార్క్ కోసం చూస్తున్నట్లయితే.. వివిధ బుక్‌మార్క్ ఫోల్డర్‌ల ద్వారా వెళ్లడం కన్నా @boomakrs అని టైప్ చేయవచ్చు. సెర్చ్ బుక్‌మార్క్‌లను ఎంచుకోవచ్చు. వినియోగదారులు ఏమి సెర్చ్ చేస్తున్నారో అది టైప్ చేయడం ద్వారా సులభంగా పొందవచ్చు.

Read Also : Google Chrome Update : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. తస్మాత్ జాగ్రత్త.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

అయితే, సెర్చ్ బ్రౌజర్ హిస్టరీని త్వరగా కనుగొనడానికి @History షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్లు ఇప్పుడు Chrome108 లేదా లేటెస్ట్ వెర్షన్‌ని వాడే యూజర్ల అందరికి అందుబాటులో ఉన్నాయని సెర్చ్ ఇంజిన్ బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఒకవేళ మీరు ఈ ఫీచర్‌లను ఉపయోగించలేకపోతే.. బ్రౌజర్‌లో కుడి టాప్ కార్నర్‌లో త్రి డాట్స్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు Help ఆప్షన్ నుంచి Google Chrome ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇంతలో, మీ సెర్చ్ సులభంగా యాక్సస్ చేసేందుకు Google ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Google Chrome brings new shortcuts for history, tabs, bookmarks_ How it works

Google Chrome brings new shortcuts for history, tabs, bookmarks_ How it works

అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇప్పుడు Google సెర్చ్‌లో వీడియోలు, వార్తలు, ఫొటోలు లేదా షాపింగ్ రిజిల్ట్స్ చూడటానికి ఫిల్టర్‌లతో పాటు సంబంధిత అంశాల లిస్టును సులభంగా స్క్రోల్ చేస్తోంది. ఇప్పుడు, యూజర్లు Googleలో టాపిక్‌లను యాడ్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.

అవి + సింబల్ ద్వారా సూచిస్తాయి. వీటిని త్వరగా జూమ్ చేయవచ్చు లేదా సెర్చ్ బ్యాక్‌ట్రాక్ చేయవచ్చు. Google ప్రకారం.. వినియోగదారు సెర్చ్ చేసే సమయంలో వెబ్‌లో కంటెంట్‌ను ఎలా సెర్ఛ్ చేస్తారు అనేదానిపై సెర్చ్ ఇంజిన్ ఆధారంగా సిస్టమ్ సంబంధిత Search Results ఆటోమాటిక్‌గా డిస్‌ప్లే చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా క్రోమ్ షార్ట్ కట్స్ ఎలా పనిచేస్తాయో ట్రై చేసి చూడండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Update your WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఈ కొత్త ఫీచర్లను పొందాలంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!