Google Chrome : క్రోమ్ బ్రౌజర్‌లో సరికొత్త ఫీచర్.. త్వరలో గూగుల్ ఇమేజ్‌లపై కంటెంట్ కూడా ఈజీగా ట్రాన్సులేట్ చేయొచ్చు..!
Google Chrome : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్ల రాబోతోంది. ఈ సరికొత్త ఫీచర్‌పై ద్వారా గూగుల్ యూజర్లు ఫొటోలపై టెక్స్ట్ కూడా సులభంగా ట్రాన్సులేట్ చేసుకోవచ్చు.

Google Chrome : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్ల రాబోతోంది. ఈ సరికొత్త ఫీచర్‌పై ద్వారా గూగుల్ యూజర్లు ఫొటోలపై టెక్స్ట్ కూడా సులభంగా ట్రాన్సులేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి క్రోమ్ (Chrome) వెబ్ బ్రౌజర్ ఏదైనా వెబ్ పేజీ మొత్తంలో టెక్స్ట్ మాత్రమే ట్రాన్సులేట్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే, ప్రస్తుతం పోస్టర్‌లు, బ్యానర్‌లు, ఇతర ఫొటోల నుంచి కంటెంట్‌ను కూడా ట్రాన్సులేట్ చేసేందుకు అనుమతి లేదు. సెర్చ్ ఇంజన్ త్వరలో ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది.
గూగుల్ యూజర్లు ఇమేజ్‌లోని టెక్స్ట్ గుర్తించి వాటిని ట్రాన్సులేట్ చేసేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి, వినియోగదారులు (Google Lens) లెన్స్‌ని ఉపయోగించి ఇమేజ్‌లోని టెక్స్ట్ ట్రాన్సులేట్ చేసుకోవచ్చు. Chrome ఫీచర్ (Leopeva64) ద్వారా ఆండ్రాయిడ్ పోలీసుల నివేదిక ప్రకారం.. వెబ్ బ్రౌజర్‌లోని ఇమేజ్‌లోని టెక్స్ట్ ట్రాన్సులేట్ చేసేందుకు Google కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ కొత్త Chromium సోర్స్ కోడ్‌లో కనిపించింది. అంతేకాదు.. Chrome కొత్త ఆప్షన్ కూడా యాడ్ అయిందని సూచిస్తుంది. ట్రాన్సులేట్ ఫీచర్ ఒకసారి యాడ్ చేసిన తర్వాత, ఇమేజ్ టెక్స్ట్ ట్రాన్సులేట్ ఫీచర్ ఫీచర్ ఫ్లాగ్‌తో యాక్టివేట్ అవుతుంది.
క్రోమ్ వెబ్ పేజీలోని మిగిలిన టెక్స్ట్ బ్రౌజర్ ద్వారా ట్రాన్సులేట్ చేసిన తర్వాత కొత్త ట్రాన్సులేట్ ఆప్షన్ Chrome కాంటెక్స్ట్ మెనులో కనిపిస్తుంది. ఈ కొత్త ఫొటో ట్రాన్సులేట్ టూల్ ఇంకా Chrome Beta లేదా కానరీ (Canary)లో అందుబాటులో లేదని గమనించాలి. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

Google Chrome Is Working on Ability to Translate Text Within Images
ప్రస్తుతం, క్రోమ్ మెను కింద అందుబాటులో ఉన్న ట్రాన్సులేట్ ఆప్షన్ క్లిక్ చేయండ ద్వారా మాత్రమే మొత్తం వెబ్ పేజీని ట్రాన్సులేట్ చేసేందుకు అనుమతిస్తుంది. గత నెలలో, Google ఆండ్రాయిడ్‌లో ఫొటో యాప్ కోసం కొత్త Search Buttion టెస్టింగ్ చేస్తున్నట్టు నివేదిక తెలిపింది. తద్వారా గూగుల్ యూజర్లు ఫొటోలను వీక్షించడానికి, ఏదైనా ఫేస్ గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. రాబోయే ఈ కొత్త ఫీచర్ ఫొటోల యాప్‌లోని లెన్స్ బటన్‌ను రీప్లేస్ చేస్తుందని నివేదిక పేర్కొంది. అంటే.. వినియోగదారులు ఫొటోలోని నిర్దిష్ట విషయం గురించి మరింత సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది.
కొత్త జెనరిక్ ‘Search’ బటన్ ఫొటోలోని ఫేస్‌లను స్కాన్ చేయడమే కాకుండా వినియోగదారుల Google ఫొటోల లైబ్రరీలో వాటి కోసం రివర్స్ సెర్చ్ కూడా చేస్తుంది. అదనంగా, OCR Text Option, ఏదైనా వస్తువుల గుర్తింపు వంటి Google Lens ఫీచర్లను కూడా అందిస్తుంది. అదే సమయంలో, వినియోగదారులు ఫొటో రైడ్ టాప్ కార్నర్‌లో అందుబాటులో ఉన్న త్రిడాట్స్ మెనుపై Click చేయండి. అప్పుడు యూజర్లు ఫొటోలపై ఆయా ఫేస్‌లను కలిగిన మరిన్ని ఫొటోలను సెర్చ్ చేయొచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..