Google : వ్యాక్సిన్ కంపల్సరీ, వర్క్ ఫ్రం హోమ్..ఉద్యోగులకు స్వల్ప ఊరట

వ్యాక్సిన్ లు వేయించుకున్న తర్వాతే..ఆఫీసులకు రావాలని, ఒక్క డోస్ వేయించుకున్నా సరిపోతుందని ఉద్యోగులకు కండీషన్ పెట్టారు. ఇచ్చిన సడలింపు గడువును వ్యాక్సిన్ డోసుల కోసం ఉపయోగించుకోవాలని ఉద్యోగులకు సూచించింది.

Google : వ్యాక్సిన్ కంపల్సరీ, వర్క్ ఫ్రం హోమ్..ఉద్యోగులకు స్వల్ప ఊరట

Google

Google Delays Return To Office : కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా పీక్ స్టేజ్ లో ఉండడంతో ఆఫీసులకు రావొద్దని..ఇంటి నుంచే పనిచేయాలని యాజమాన్యాలు చెప్పడంతో కొంతమంది ఉద్యోగులు ఫుల్ ఖుష్ అయిపోయారు. హాయిగా ఇంటి పని చేసుకుంటూ..ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నారు.

Read More : Nasa Photo : నాసా స్పేస్ కెమెరాలో…ఒలంపిక్ వెలుగు జిలుగులు

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి పలు కంపెనీలు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆఫీసులకు రావాల్సిందేనని ఖరాఖండిగా చెప్పాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం వర్క్ ఫ్రం హోమ్ నడిపించాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీసు బేస్ మీద ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా వర్క్ ఫ్రం హోమ్ ను మరో నెలకు పైనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి.

Read More : Instagram Longer Reels : ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 60 సెకన్ల రీల్స్ పోస్టు చేసుకోవచ్చు!

ఈ మేరకు గూగుల్, ఫేస్ బుక్, యాపిల్ తో పాటు..కొన్ని MNCలు ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి. వ్యాక్సిన్ లు వేయించుకున్న తర్వాతే..ఆఫీసులకు రావాలని, ఒక్క డోస్ వేయించుకున్నా సరిపోతుందని ఉద్యోగులకు కండీషన్ పెట్టారు. ఇచ్చిన సడలింపు గడువును వ్యాక్సిన్ డోసుల కోసం ఉపయోగించుకోవాలని ఉద్యోగులకు సూచించింది. అక్టోబర్ 18 వరకు ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోంలో కొనసాగవచ్చని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే…యాపిల్..ఫేస్ బుక్ కూడా ఈ విధంగానే ప్రకటన విడుదల చేశాయి.

Read More : Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రశాంతతే ముఖ్యమని, ఈ పాలసీని యూఎస్ నుంచి మిగతా దేశాలకు విస్తరిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉండడం..దీంతో పాటు డెల్టా కేసులు నమోదవుతుండడంతో…ఈ ఆదేశాలు జారీ చేశాయి. తాజా ఆదేశాలతో మరికొన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.