Google Phones: ఇకపై ఆ ఫోన్స్ కనిపించకుండా చేసిన గూగుల్

ఆపిల్‌కు పోటీగా పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌. తాజాగా పిక్సెల్‌ 6, 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లలోకి..

Google Phones: ఇకపై ఆ ఫోన్స్ కనిపించకుండా చేసిన గూగుల్

Google Pixel

Google Phones: ఆపిల్‌కు పోటీగా పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌. తాజాగా పిక్సెల్‌ 6, 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లలోకి రిలీజ్‌ చేసింది. ఇప్పటివరకూ మార్కెట్లో ఉన్న పిక్సెల్‌ 4ఏ 5జీ, పిక్సెల్‌ 5 స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు సమాచారం. గూగుల్‌ పిక్సెల్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోనందుకు గాను పిక్సెల్‌ 4ఏ 5జీ, పిక్సెల్‌5 స్మార్ట్‌ఫోన్లను నిలిపివేయనుందని తెలుస్తోంది.

పిక్సెల్‌ 4ఏ 5జీ, పిక్సెల్‌​ 5 స్మార్ట్‌ఫోన్స్‌ ల కోసం వెదికితే.. ఆన్‌లైన్‌ స్టోర్‌లో సోల్డ్‌ ఔట్‌ అనే కనిపిస్తోందని న్యూస్‌ వెబ్‌సైట్‌ ది వెర్జ్‌ పేర్కొంది. పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 4ఎక్స్‌ఎల్‌ను ప్రవేశపెట్టిన సంవత్సరంలోపే ఈ స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌ నిలిపే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రిలీజ్‌ చేసిన గూగుల్‌ పిక్సెల్‌ 5ఏ 5జీను కేవలం అమెరికా, జపాన్‌ మార్కెట్లలోకే రిలీజ్‌ చేసింది.

భారత మార్కెట్లలోకి వచ్చే సమయంపై ఎటువంటి క్లారిటీ లేదు. గూగుల్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లకు ఛార్జర్ లేకుండా మార్కెట్లలోకి రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఫోన్ ఛార్జర్ లేకుండా లాంచ్ చేసి కొత్త పద్ధతికి తెరలేపనుంది.