Google on apps: భార్యలపై నిఘా.. గూగుల్ పాలసీకి విరుద్ధం

స్టాకర్‌వేర్ వ్యాప్తిని తగ్గించడానికి గూగుల్ యాక్షన్ తీసుకోనుంది. భార్యలు లేదా భర్తలపై నిఘాపెట్టడాన్ని స్టాకర్ వేర్ అంటారు. ఇటువంటి పనులకు పాల్పడే వారిపై గూగుల్ ఫోకస్ పెట్టింది.

Google on apps: భార్యలపై నిఘా.. గూగుల్ పాలసీకి విరుద్ధం

Google

Google on apps: స్టాకర్‌వేర్ వ్యాప్తిని తగ్గించడానికి గూగుల్ యాక్షన్ తీసుకోనుంది. భార్యలు లేదా భర్తలపై నిఘాపెట్టడాన్ని స్టాకర్ వేర్ అంటారు. ఇటువంటి పనులకు పాల్పడే వారిపై గూగుల్ ఫోకస్ పెట్టింది. ప్లే స్టోర్ లో అతిక్రమించిన పాలసీలతో యాప్ లను ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఏదో ఒక ఫేక్ యాప్ పేరుతో అనుమానిత మెసేజ్ లు, కాల్ వివరాలు, పర్సనల్ యాక్టివిటీ వంటివి దొంగిలించే ప్రమాదం ఉంది. ఒకసారి డౌన్ లోడ్ అయ్యాక ఈ యాప్ లు భార్యల స్మార్ట్ ఫోన్లపై ప్రయోగిస్తుంటారు యూజర్లు.

అటువంటి వాటిని మేం అస్సలు ఎంకరేజ్ చెయ్యం. యాడ్స్ వెంటనే తీసేయడంతో పాటు మా పాలసీని బ్రేక్ చేయకుండా ఉండేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటాం. డిటెక్షన్ సిస్టమ్స్ నుంచి డేటాను దొంగిలించడాన్ని అడ్డుకుంటామని గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

…………………………………………………..: అజీర్ణం, గ్యాస్ సమస్యలకు యాలకులతో చెక్

గూగుల్ బ్యాన్ చేసిన యాప్ లను కూడా వాడుతూ.. ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబరులో ప్లేస్టోరీ పాలసీలకు తగ్గట్లుగా ఉన్న యాప్ లను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని నిషేదించింది. ఇలాంటి యాప్ లు వాడి భార్యలపై నిఘా పెడుతున్నామని మాత్రమే అనుకుంటున్నారు. కానీ, అంతకుమించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అవుతుందని గమనించలేకపోతున్నారని టెక్ నిపుణులు అంటున్నారు.

ఇదిలా ఉంటే తమ పిల్లలు గూగుల్ లో ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ట్రాకింగ్ యాప్ లు స్వయంగా డెవలప్ చేసి ప్లే స్టోర్ లో ఉంచింది.

సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ కస్పర్‌స్కై రీసెంట్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం ఇండియాలో 4వేల 627మంది యూజర్లు తమ భార్యలపై నిఘా పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటన్నట్లు తెలిసింది. 2020లో మొత్తం 53వేల 870మంది యూజర్లు ఇటువంటి చర్యలకు పాల్పడగా.. 2019లో 67వేల 500మంది ప్రయత్నించారు.