Google Services: రేపటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లు Google వాడలేరు

ప్రపంచంలోని అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్.. రాబోయే కొద్ది రోజుల్లో ఊహించని విధంగా కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో తన అత్యంత ప్రజాదరణ పొందిన సేవలను మూసివేయబోతోంది.

Google Services: రేపటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లు Google వాడలేరు

Google (1)

Google Services: ప్రపంచంలోని అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్.. రాబోయే కొద్ది రోజుల్లో ఊహించని విధంగా కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో తన అత్యంత ప్రజాదరణ పొందిన సేవలను మూసివేయబోతోంది. అవును, సెప్టెంబర్ 27వ తేదీ నుంచి గూగుల్.. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ మరియు జీ-మెయిల్ వంటి కొన్ని సేవలు ఆండ్రాయిడ్ పరికరాల్లో పనిచేయవు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉపయోగించే గూగుల్ కొన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు గూగుల్ తన వెబ్‌సైట్‌లో గడువును ప్రకటించింది.

ఈ గడువు ప్రకారం.. వినియోగదారులు తమ ఫోన్‌ను అప్‌డేట్ చేయాలి లేదా కొత్త మొబైల్ ఫోన్ తీసుకోవల్సి ఉంటుంది. గూగుల్ ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులపై ప్రభావం చూపుతుంది.

ఇప్పటికీ ఆండ్రాయిడ్ 2.3 డివైస్‌లలో గూగుల్ అకౌంట్‌ని ఉపయోగిస్తున్న వారు బ్లాక్ చేయబడతారని గూగుల్ చెబుతోంది. Google ఈ పాత వెర్షన్ డిసెంబర్ 2010లో ప్రారంభించబడింది. ఈ ప్లాట్‌ఫామ్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు Google వెల్లడించింది. వినియోగదారులను సురక్షితంగా ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ భావిస్తోంది. గూగుల్ తరచుగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పాత వెర్షన్‌లను తొలగిస్తుంది. దాని స్థానంలో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెడుతోంది.

పాత వెర్షన్‌లు బగ్‌లు మరియు హ్యాకర్లకు ఎక్కువ అవకాశం ఉన్నందున Google ఫోన్లను అప్‌గ్రేడ్ చేసినవాటికే ఈ రకమైన అవకాశం ఇస్తుంది. ఆండ్రాయిడ్ 11 లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం నేడు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన వెర్షన్ ఇది. ఫిబ్రవరి 2017లో, Google Google Payని నిలిపివేసింది. ఆండ్రాయిడ్ 2.3 ఉపయోగించే యూజర్ల కోసం ఈ సర్వీస్ సస్పెండ్ చేయబడింది. ఈ నెలలో, ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో పరికరాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో, వారు Google అకౌంట్‌కు లాగిన్ అవ్వడం కష్టమవుతుంది.

2.3 ఉపయోగించే వినియోగదారులు యూజర్ పేరు మరియు తప్పు పాస్‌వర్డ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లను పొందుతారు. వారు సరైన లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ను ఇచ్చినప్పటికీ, వారు లాగిన్ అవ్వలేరు. వారు ఈ వెర్షన్‌లో గూగుల్ క్యాలెండర్ లేదా జిమెయిల్ అకౌంట్‌ను జోడిస్తే, YouTube, Google Pay స్టోర్, Gmail, Google క్యాలెండర్ మరియు ఇతర Google యాప్‌లు కూడా మూసివేయబడతాయి. ఈ యాప్‌లను ఉపయోగించడానికి, మీరు మీ ఫోన్‌ను Android 3.0 కి అప్‌గ్రేడ్ చేయాలి.

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్‌, ఐఫోన్లలో ఐవోఎస్‌ 15 వెర్షన్‌లు నడుస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ 2.3 వెర్షన్‌తో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఫోన్లు ఇవి.. Sony Xperia Advance, Lenovo K800, Sony Xperia Go, Vodafone Smart II, Samsung Galaxy S2, Sony Xperia P, LG Spectrum, Sony Xperia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532 వీటిలో రేపటి నుంచి గూగుల్ సరిగ్గా పనిచేయదు.