Google Nest Mini : ఫ్లిప్‌కార్ట్‌లో రూపాయికే సూపర్ స్మార్ట్ స్పీకర్..!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కేవలం రూపాయికే గూగుల్‌ నెస్ట్‌ మినీ స్మార్ట్ స్పీకర్‌ (Smart Speaker)ను అందిస్తోంది. Google Nest Mini ఫోన్ ధర రూ.2999 వరకు ఉంటుంది.

Google Nest Mini : ఫ్లిప్‌కార్ట్‌లో రూపాయికే సూపర్ స్మార్ట్ స్పీకర్..!

Google Nest Mini Can Be Bought For Re 1 On Flipkart

Google Nest Mini : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కేవలం రూపాయికే గూగుల్‌ నెస్ట్‌ మినీ స్మార్ట్ స్పీకర్‌ (Smart Speaker)ను అందిస్తోంది. Google Nest Mini ఫోన్ ధర రూ.2999 వరకు ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ కింద రూ.1 కు మాత్రమే అందిస్తోంది. అదే Pixel 4a ఫోన్ కొంటే మాత్రం.. ఈ స్మార్ట్ స్పీకర్ డివైజ్ హోంను ఉచితంగా పొందవచ్చు. Nest Mini డివైజ్ అనేది గూగుల్ అందించే అత్యంత పాపులర్ స్మార్ట్ స్పీకర్లలో ఒకటి. మీరు ఈ స్మార్ట్ స్పీకర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

అయితే ఉచితంగా పొందాలంటే ఫ్లిప్‌కార్ట్‌ అందించే గూగుల్ Pixel 4A స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ .31,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఎవరైతే కొంటారో అదనంగా రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు గూగుల్‌ నెస్ట్‌ మినీ స‍్పీకర్‌‌ను పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ ద్వారా Pixel 4Aపై 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పథకం కింద పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ.15,300 చెల్లించవచ్చు. గూగుల్ Pixel 4A పొందవచ్చు.

Flipkart Big Saving days సమయంలో ఇదే స్మార్ట్ ఫోన్ రూ.25,999లకే అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇప్పుడు అసలు ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 5.81-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, పంచ్ హోల్ OLED డిస్‌ప్లే, 9.5: 9 యాస్పెట్‌ రేషియోతో ఉంది. మిడ్ రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730G చిప్‌సెట్‌తో పాటు 6GB వేరియంట్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. గూగుల్ Pixel 4A స్కైర్‌ షేప్‌ కెమెరా, 12.2MP, డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటెక్షన్, కెమెరా వెనుక f/ 1.7 aperture, iOS 77 డిగ్రీల వ్యూతో ఉంది. ఫ్రంట్ సైడ్ లో 8MP ఫ్రంట్ కెమెరా, f/ 2.0 aperture, 84-డిగ్రీల ఫైల్డ్‌ వ్యూను అందిస్తోంది.