కొత్త ప్రైవసీ టూల్స్ : Googleలో స్టోర్ అయిన మీ Data డిలీట్ చేసుకోండిలా

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కొత్త ప్రైవసీ టూల్స్ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ యూజర్ల ప్రైవసీ కోసం ప్రత్యేకించి ఈ కొత్త టూల్స్ రిలీజ్ చేసింది.

  • Published By: sreehari ,Published On : October 7, 2019 / 11:58 AM IST
కొత్త ప్రైవసీ టూల్స్ : Googleలో స్టోర్ అయిన మీ Data డిలీట్ చేసుకోండిలా

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కొత్త ప్రైవసీ టూల్స్ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ యూజర్ల ప్రైవసీ కోసం ప్రత్యేకించి ఈ కొత్త టూల్స్ రిలీజ్ చేసింది.

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కొత్త ప్రైవసీ టూల్స్ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ యూజర్ల ప్రైవసీ కోసం ప్రత్యేకించి ఈ కొత్త టూల్స్ రిలీజ్ చేసింది. గూగుల్ సొంత సర్వీసులైన గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ అసిసెంట్ ప్లాట్ ఫాంల నుంచి తమ డేటాను యూజర్లు ఈజీగా డిలీట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గూగుల్ సెర్చ్ లో ఇంటర్నెట్ యూజర్ ఏ విషయాన్ని సెర్చ్ చేసినా అంతా గూగుల్ స్టోర్ చేస్తుంది. మీ బ్రౌజర్ క్లీన్ చేసినప్పటికీ గూగుల్ ప్లాట్ ఫాంపై మీ ప్రైవసీ డేటా అలానే ఉంటుంది. అది డిలీట్ కాదు. మీ డేటాను డిలీట్ చేసుకోవాలంటే మాన్యువల్ గా డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, అసిస్టెంట్ ప్లాట్ ఫాంల్లో స్టోర్ అయిన యూజర్ డేటాను ఎలా డిలీట్ చేయాలో ఓసారి చూద్దాం. 

గూగుల్ మ్యాప్స్ : 
గూగుల్ మ్యాప్స్ లో మీరు ఏదైనా లొకేషన్ సెర్చ్ చేస్తున్నారా? గూగుల్ మ్యాప్స్ రీజియన్లవారీగా ఎప్పటికప్పడూ లొకేషన్లను ట్రాక్ చేస్తుంటుంది. మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే మీరు క్రోమ్ బ్రౌజర్ లో  incognito mode టర్న్ ఆన్ చేసి సెర్చ్ చేయండి. ఈ కొత్త టూల్ అక్టోబర్ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. iOS యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

* మీరు వాడేది Chrome బ్రౌజర్ అయితే ఇలా చేయండి. 
* క్రోమ్ incognito mode (Shift +Ctrl+N) ఓపెన్ చేయండి. 
* ఇందులో సెర్చ్ చేస్తే.. గూగుల్ మీ డేటా యాక్టివిటీని ట్రాక్ చేయలేదు.
* మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? ఏ లొకేషన్ లో ఉన్నారో ట్రాక్ చేయలేదు.
* మీరు చేయాల్సిందిల్లా మీ mobileలో Google Maps యాప్ ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్ లో మీ ప్రొఫైల్ బటన్ పై క్లిక్ చేయండి. 
* Incognito Mode టర్న్ ఆన్ చేయండి. ఆ తర్వాత Close బటన్ పై క్లిక్ చేయండి.

యూట్యూబ్ : ఆటో డిలీట్ ఫంక్షన్ టూల్ 
* గూగుల్ సొంత సర్వీసుల్లో యూట్యూబ్ ఒకటి. మీరు సెర్చ్ చేసిన ప్రతి వీడియో అందులో స్టోర్ అవుతుంది.
* సెర్చ్ చేసిన డేటా డిలీట్ చేసుకోవాలంటే కొత్త టూల్ ద్వారా పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు. 
* కొత్త ఆటో డిలీట్ ఫంక్షన్ వస్తోంది. 
* వాచ్ చేసిన వీడియోల హిస్టరీని డిలీట్ చేసుకునే సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. 
* లిమిటెట్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
* యూట్యూబ్ లాగిన్ అయ్యాక..  My activity ఓపెన్ చేయండి. 
* Change how long you keep బటన్ పై క్లిక్ చేయండి. 
* 3 నెలలు తర్వాత హిస్టరీని ఆటోమాటిక్ డిలీట్ చేసుకోవచ్చు. 
* 18 నెలల తర్వాత ఆటోమాటిక్ డిలీట్ సెట్ చేసుకోవచ్చు.
* Next బటన్ క్లిక్ చేయాలి. 
* Delete Future, Delete Now అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
* కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయండి. Confirm బటన్ క్లిక్ చేయండి. 
* వీడియోల హిస్టరీని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. 
* మాన్యువల్ గా వీడియోలను డిలీట్ చేసుకోవచ్చు.  

గూగుల్ అసిస్టెంట్ :
* Google Assistant .. వాయిస్ కమాండ్ సెర్చ్ ద్వారా సమాచారాన్ని మీ ముందు ఉంచుతుంది. 
* మీ వాయిస్ సెర్చ్ ను గూగుల్ రికార్డు చేస్తోంది. 
* అసిస్టెంట్ నుంచి సెర్చ్ చేసిన డేటాను డిలీట్ చేసే కొత్త ఫీచర్ రాబోతోంది. 
* తొలుత ఇంగ్లీష్ లో ఫీచర్ రాబోతోంది. 
* ఆ తర్వాత ఇతర భాషల్లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ కానుంది. 
* వాయిస్ కమాండ్స్ ద్వారా ఈ అసిస్టెంట్ యాక్టివిటీని వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. 
* గూగుల్ అసిస్టెంట్ నుంచి ఏదైనా సెర్చ్ చేయాలంటే.. Hey Google అని వాయిస్ కమాండ్ ఇస్తుంటారు. 
* Hey Google.. delete the last thing i said to you అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు
* అప్పటివరకూ సెర్చ్ చేసినా డేటా మాత్రమే డిలీట్ చేస్తుంది. 
* చాలా రోజుల క్రితం రికార్డు అయినా లేదా మొత్తం డేటాను డిలీట్ చేయాలంటే ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. 

గూగుల్ Passwords :
* యూనివర్శల్ యాప్ ప్లాట్ ఫాంపై కొత్త టూల్ ప్రవేశపెడుతోంది గూగుల్. 
* అదే.. Password CheckUp. 
* మీ పాస్ వర్డ్ Weak అయితే వెంటనే చెప్పేస్తుంది. 
* ఎన్నో సైట్లలో మీ పాస్ వర్డ్ వాడారో కూడా చెప్పేస్తుంది.
* క్రోమ్ లేదా ఆండ్రాయిడ్ బ్రౌజర్లలో సేవ్ చేసిన పాస్ వర్డులపై పనిచేస్తుంది.
* ప్రస్తుతం.. passwords.google.comపై ఈ టూల్ అందుబాటులో ఉంది.
* ఈ ఏడాది తర్వాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో Password Check Up బటన్ యాడ్ కానుంది.