గూగుల్ పేతో ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 11:10 AM IST
గూగుల్ పేతో  ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్

గూగుల్ పే తమ యూజర్లకు ఒక శుభవార్త వినిపించింది. ఇక నుంచి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ రీఛార్జ్ ను గూగుల్ పే నుంచి ఈజీగా చేసుకోవచ్చని గూగుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లను గూగుల్ పే కి లింక్ చేసి, రీఛార్జ్ చేసుకోవచ్చు. అకౌంట్ లను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. 

పాస్ట్ ట్యాగ్ అకౌంట్ లను రీఛార్జ్ చేయటానికి యూజర్లు గూగుల్ పే యాప్ లోకి వెళ్ళి బిల్ పేమెంట్స్ సెక్షన్ లో ఫాస్ట్ ట్యాగ్ కి జత చేసిన బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయాలి. తర్వాత వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి, డబ్బులు చెల్లించాలి. అంతేకాకుండా ఫాస్ట్ ట్యాగ్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కి లాగిన్ అయ్యి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫాస్ట్ ట్యాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్ధ. ఈ యాప్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పని చేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా నేరుగా టోల్ గేట్ బిల్లును యజమాని సేవింగ్స్ ఖాతా నుంచి చెల్లించడానికి వీలుగా ఉంటుంది.