Google Pay UPI Payments : గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. రూపే క్రెడిట్ కార్డులతో ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

Google Pay UPI Payments : గూగుల్ పే యూజర్లు RuPay క్రెడిట్ కార్డ్‌లతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ UPI లావాదేవీలను చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ పేతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Google Pay UPI Payments : గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. రూపే క్రెడిట్ కార్డులతో ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

Google Pay users can now make UPI payments using RuPay credit cards

Google Pay UPI Payments using RuPay credit cards : ప్రస్తుత రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారత్ వ్యాప్తంగా ఆన్‌లైన్ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మార్చి 2023 నాటికి.. నెలవారీ UPI లావాదేవీల సంఖ్య 8.7 బిలియన్లకు (సుమారు 87 లక్షలు) చేరుకుంది. అయితే, ఈ లావాదేవీలు చాలా వరకు డెబిట్ కార్డ్‌లతో లింక్ అయిన UPI IDల ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు, భారత్‌లో డిజిటల్ పేమెంట్ల వృద్ధిని మరింత పెంచేందుకు UPIతో RuPay క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయాలని గూగుల్ పేతో NPCI భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

యూపీఐ యూజర్లు.. ఇప్పుడు (RuPay) క్రెడిట్ కార్డ్‌లు ఆమోదించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మర్చంట్ల పేమెంట్లను (Google Pay)తో RuPay క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయవచ్చు. అధికారిక ప్రకటనలో యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లందరికీ ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉందని రూపే ప్రకటించింది. త్వరలో మరిన్ని బ్యాంకులకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.

Read Also : Reliance JioMart Layoffs : కోత మొదలైంది.. జియోమార్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. మరో 9వేల జాబ్స్ తగ్గించే అవకాశం..!

గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, శరత్ బులుసు (Sharath Bulusu) మాట్లాడుతూ..,‘గూగుల్ పే.. భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు భాగస్వామిగా ప్రతిరోజూ లక్షలాది మంది యూజర్లు సురక్షితంగా సౌకర్యవంతంగా డిజిటల్ పేమెంట్లను చేయడానికి వీలు కల్పిస్తోంది. ఈ ఫీచర్ గూగుల్ పే యూజర్లకు పేమెంట్లు చేయడంలో మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. మీరు కూడా RuPay క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీ Google Pay UPI IDతో లింక్ చేయాలంటే.. దశల వారీ ప్రక్రియ ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.

Google Pay users can now make UPI payments using RuPay credit cards

Google Pay users can now make UPI payments using RuPay credit cards

గూగుల్ పేలో RuPay క్రెడిట్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలంటే? :

* మీ Android ఫోన్ లేదా iPhoneలో Google Payని ఓపెన్ చేయండి.
* Settings వెళ్లండి.. ‘UPIలో RuPay క్రెడిట్ కార్డ్’ ఆప్షన్లు Tap చేయండి.
* మీకు రూపే క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.
(a) కార్డ్ నంబర్, గడువు ముగిసే చివరి 6 అంకెలను ఎంటర్ చేయడం, (b) మీ బ్యాంక్ నుంచి OTPని ఎంటర్ చేయడం ద్వారా ప్రత్యేకమైన UPI పిన్‌ని సెట్ చేయండి.
* లావాదేవీల కోసం మీ UPI రూపే క్రెడిట్ కార్డ్‌తో లింక్ చేయవచ్చు.
* మీరు UPI లావాదేవీలు చేసే విధంగానే సెట్ చేసిన UPI PINని ఎంటర్ చేయడం ద్వారా UPI పేమెంట్ల సమయంలో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.

ముఖ్యంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ 2022లో UPI ప్లాట్‌ఫారమ్‌కు రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసేందుకు అనుమతించింది. డిజిటల్ పేమెంట్ల సౌలభ్యాన్ని యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. Paytm, PhonePe వంటి UPI పేమెంట్ గేట్‌వేలు UPI లైట్ సర్వీసును ప్రారంభించాయి. గూగుల్ పే యూజర్లు PINని ఆఫ్‌లైన్‌లో ఎంటర్ చేయకుండా UPI ద్వారా పేమెంట్లను అనుమతిస్తుంది. తద్వారా పిన్‌ను ఎంటర్ చేయడం లేదా బ్యాంకుల సర్వీసులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గూగుల్ పే విషయానికొస్తే, త్వరలో UPI Lite సర్వీసును ప్రారంభించనుంది.

Read Also : WhatsApp Trick : బ్లాక్ కలర్, ఫ్యాన్సీ ఫాంట్‌లతో వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!