Google Pixel 6 ఫోన్ వచ్చేసిందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత? సేల్ ఎప్పుడంటే?

స్మార్గ్ ఫోన్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అక్టోబర్ 19న గూగుల్ తమ కొత్త పిక్పెల్ ఫోన్ వేరియంట్లను రిలీజ్ చేసింది.

Google Pixel 6 ఫోన్ వచ్చేసిందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత? సేల్ ఎప్పుడంటే?

Google Pixel 6, Pixel 6 Pro Launched Key Specs, Top Features, Sale Date And Price (1)

Google Pixel 6, Pixel 6 Pro launched: స్మార్గ్ ఫోన్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అక్టోబర్ 19న గూగుల్ తమ కొత్త పిక్పెల్ (Pixel 6, Pixel 6 Pro) ఫోన్ వేరియంట్లను రిలీజ్ చేసింది. ఈ కొత్త పిక్పెల్ 6 స్మార్ట్ ఫోన్లు ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా కాకుండా సింగిల్ యూనిక్ బిట్‌తో వచ్చింది. ఇందులో Qualcomn, MediaTek చిప్ సెట్స్ అందించింది. ఈ ఫోన్లలో గూగుల్ క్రియేటెడ్ ప్రాసెసర్ Tensor కూడా చేర్చింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే Pixel 6, Pixel 6 pro ఈ రెండు వేరియంట్లను ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే లాంచ్ చేసింది.

ఈ రెండు పిక్సెల్ 6 ఫోన్లు కొత్త డిజైన్ తో వచ్చాయి. రియర్ ప్యానెల్ భారీ కెమెరా బంప్ తో వచ్చింది. ఫ్రంట్ సైడ్ లో పంచ్ హోల్ కెమెరా ఉంది. 6.4 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. ప్రొ మోడల్స్ లో 6.7 అంగుళాల హైయర్ 120Hz రిఫ్రెష్ రేటు ఉంది. ప్రోలో అడాప్టివ్ రిఫ్రెష్ రేటు వాడారు. దీనిద్వారా ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ వస్తుంది. గతంలో Pixels ఫోన్ల మాదిరిగా కాకుండా Pixel 6, Pixel 6 pro మోడళ్లు అప్ గ్రేడెడ్ కెమెరా హార్డ్‌వేర్‌తో వచ్చింది.
Google Pixel 6 Prices Leak : లాంచింగ్ ముందే లీక్.. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధర తెలిసిందోచ్!

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఇవే :
గూగుల్ ఆరేళ్లుగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను డెవలప్ చేస్తోంది. మొదటిసారి గూగుల్ పిక్సెల్ లైనప్ లో లేటెస్ట్ టాప్ ఎండ్ స్మార్ట్ ఫోన్లకు దీటుగా మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ప్రాసెసర్ (Processor): పిక్సెల్ 6, పిక్సెల్ 6ప్రో – Google Tensor chipset అమర్చింది. ఇది గూగుల్ కస్టమ్ ప్రాసెసర్. ARM కోర్స్ ద్వారా క్రియేట్ చేసింది. Qualcomm Snapdragon 888 మాదిరిగానే ఈ ప్రాసెసర్ రన్ అవుతుంది. గూగుల్ టెన్సార్ చిప్ సెట్ లో 8-CPU cores, 20GPU cores కలిగి ఉంది. CPU cores విషయానికి వస్తే.. 2-హై పర్ఫార్మెన్స్ ARM X1 cores (2.8GHz)పై రన్ అవుతుంది. 2 A76 cores (2.25GHz), 4 A55 పవర్ ఎఫిషియంట్ కోర్స్ (1.8GHz) వద్ద రన్ అవుతుంది.

RAM : పిక్సెల్ 6 వేరియంట్ 8GB RAM, పిక్సెల్ 6ప్రో 128GB RAMతో వచ్చింది.

Internal storage: బేసిక్ వేరియంట్ పిక్సెల్6, పిక్సెల్ 6ప్రో 128GB స్టోరేజీతో వచ్చాయి. టాప్ ఎండ్ వేరియంట్ 512GB వరకు అందిస్తోంది.

Screen: పిక్సెల్ 6 ఫోన్ 6.4 అంగుళాల స్ర్కీన్ (1080×2400) రెజుల్యుషన్, 90Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. పిక్సెల్ 6ప్రో 6.7 అంగుళాల డిస్‌ప్లేతో 1440×3120, 120Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. ఈ రెండు వేరియంట్లలో OLED ప్యానెల్ వాడారు.

Rear camera: పిక్సెల్ 6 వేరియంట్ 50MP ఇమేజ్ సెన్సార్ ఉంది. అల్ట్రా వైడ్ కెమెరా, 12MP ఫోటోలను తీసుకోవచ్చు. పిక్సెల్ 6ప్రోలో కూడా ఈ రెండు కెమెరాలు ఉన్నాయి. అదనంగా టెలిఫొటో లెన్స్ కెమెరా 48MP సెన్సార్ ఉంది. ఆప్టికల్ జూమ్ రేంజ్ కెమెరా 4X కలిగి ఉంది.

Front camera: పిక్సెల్ 6లో 8MP కెమెరా, ప్రో మోడల్ 11MP షూటర్ కలిగి ఉంది.

Software : సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ సపోర్టు చేస్తుంది. సెక్యూరిటీ అప్ డేట్స్ పొందవచ్చు.

Battery: పిక్సెల్ 6 ఫోన్ 4624mAh బ్యాటరీతో వచ్చింది. పిక్సెల్ 6ప్రోలో 5003mAh బ్యాటరీ అమర్చారు. ఈ రెండు ఫోన్లు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్ లెస్ ఛార్జింగ్ తో వచ్చింది.
Flipkart Discount Offer: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్.. చౌకగా 5G స్మార్ట్ ఫోన్!

Special Features :
గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ లో కెమెరా ఫంక్షనాల్టీపైనే ఫోకస్ పెట్టింది. గ్రేట్ హార్డ్ వేర్ కెమెరాలతో తీసుకొచ్చింది గూగుల్. సూపర్ కెమెరాలతో పాటు కూల్ సాఫ్ట్ వేర్ ఫీచర్లతో కెమెరా, ఫొటో యాప్స్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్లలో స్పెషల్ ఫీచర్ ఒకటి యూజర్లను అట్రాక్ట్ చేసేలా ఉంది. Magic Eraser tool.. ఈ టూల్ ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్లు తమ ఫొటోలో అవసరం లేని బ్యాక్ గ్రౌండ్ భాగాన్ని సులభంగా రిమూవ్ చేసుకోవచ్చు. రియల్ టోన్ మోడ్ (Real Tone Mode) కూడా అందిస్తోంది. దీనిద్వారా ఫొటోలోని స్కిన్ కలర్ కచ్చితత్వాన్ని పొందవచ్చు. డార్కర్ స్కిన్ టోన్ కలిగిన యూజర్లకు కూడా ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా వీటిలో Motion Mode, Face Unblur సహా పలు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు IP68 సర్టిఫైడ్ కలిగి ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.

కలర్ ఆప్షన్లు ఇవే :
Pixel 6 బేసిక్ మోడల్.. Kinda Coral, Sorta Seafoam, and Stormy Black కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. Pixel 6 pro కూడా Cloudy White, Sorta Sunny, Stormy Black Shades వంటి కలర్లతో వచ్చింది.

ఈ ఫోన్లలో AI ఎనాన్స్ మెంట్స్ అందించింది. రియల్ టైం లాంగ్వేజీ ట్రాన్సలేషన్లకు చేర్చింది. ఫోన్ యాప్ ద్వారా యూజర్లు ఆటోమాటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ధర ఎంతంటే? :
Pixel 6 బేసిక్ మోడల్ ప్రారంభ ధర రూ.599 డాలర్లు (రూ.45వేలు) ఉండొచ్చు. ఈ వేరియంట్ 128GB స్టోరేజీతో వచ్చింది. మరో వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజీతో వచ్చింది. దీని ధర మార్కెట్లో 699 డాలర్లు (రూ.52,500)గా నిర్ణయించింది గూగుల్. Pixel 6 pro ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్లలో (128GB, 256GB, 512GB) విక్రయించనుంది. 128GB వేరియంట్ ధర 899 డాలర్లు (రూ.67,500), 256GB వేరియంట్ 999 డాలర్లు (రూ.75వేలు), 512GB వేరియంట్ ధర 1099 డాలర్లు (రూ.82,500) వరకు ఉండనుంది.

ఎలా కొనాలంటే :
గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6ప్రో స్మార్ట్ ఫోన్లు.. లిమిటెడ్ క్వాంటిటీలు, లిమిటెడ్ మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ల సేల్ మొత్తంగా 8 దేశాల్లో మాత్రమే ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి భారత మార్కెట్లో అందుబాటులో లేదు. అమెరికా మార్కెట్ నుంచి తెప్పించుకోవచ్చు. ధర విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ గూగుల్ Pixel 6, Pixel 6 Pro ఫోన్ల ప్రారంభ ధరలు 599 డాలర్లు, 899 డాలర్ల నుంచి అందుబాటులోకి వచ్చేశాయి.
Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?