Personal Loan Apps : పర్సనల్ లోన్ యాప్స్ పనిపట్టిన గూగుల్.. భారత్‌లో ప్లే స్టోర్ నుంచి తొలగింపు.. ఎందుకంటే?

Personal Loan Apps : భారత్‌లో ప్లే స్టోర్ (Play Store) నుంచి దాదాపు 2వేల పర్సనల్ లోన్ యాప్‌లను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్లే స్టోర్ నుంచి పర్సనల్ లోన్ యాప్స్ తొలగించినట్టు తెలిపింది.

Personal Loan Apps : పర్సనల్ లోన్ యాప్స్ పనిపట్టిన గూగుల్.. భారత్‌లో ప్లే స్టోర్ నుంచి తొలగింపు.. ఎందుకంటే?

Google removes around 2000 Personal Loan Apps From Play Store in India due to safety reasons

Personal Loan Apps : భారత్‌లో ప్లే స్టోర్ (Play Store) నుంచి దాదాపు 2వేల పర్సనల్ లోన్ యాప్‌లను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్లే స్టోర్ నుంచి పర్సనల్ లోన్ యాప్స్ తొలగించినట్టు తెలిపింది. దేశంలో లెండింగ్ కేటగిరీలోని మొత్తం యాప్‌లలో సగానికి పైనే ఉన్నాయని గూగుల్ పేర్కొంది. ఈ తరహా యాప్‌లను ఏడాది ప్రారంభం నుంచి తొలగిస్తోంది. లోన్ పేరుతో వినియోగదారులను వేధింపులకు గురిచేయడం, బ్లాక్‌మెయిల్, దోపిడీ రుణాల నుంచి రుణగ్రహీతలను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకు వచ్చింది.

ఆర్బీఐ చొరవతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం Google భారత్‌లో రుణాలు ఇచ్చే ఆన్‌లైన్ యాప్‌ల వైపు దృష్టి సారించింది. కొత్త Play Store మార్గదర్శకాల ప్రకారం.. “స్థానిక పరిశోధన, వాటాదారుల అభిప్రాయాల సపోర్టుతో వ్యక్తిగత రుణ యాప్‌లతో Google Play విధానాలను అప్‌డేట్ చేస్తున్నామని Google ఆసియా-పసిఫిక్ ట్రస్ట్ & సేఫ్టీ సీనియర్ డైరెక్టర్, హెడ్ సైకత్ మిత్రా అన్నారు. దేశంలో ఈ యాప్‌లు భారతీయ రుణదారులకు ముప్పు కలిగిస్తున్నాయని, అధికారులతో సంప్రదించిన తర్వాత ఆయా యాప్స్ తొలగించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Google removes around 2000 Personal Loan Apps From Play Store in India due to safety reasons

Google removes around 2000 Personal Loan Apps From Play Store in India 

యాప్‌లను అప్‌లోడ్ చేసినప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో సమీక్షిస్తారని తెలిపారు. లోన్ యాప్‌ల విషయంలో చాలా నేరపూరిత కార్యకలాపాలు నమోదయ్యాయని మిత్రా వెల్లడించారు. అనేక మంది ఆన్‌లైన్ వినియోగదారులు లోన్ రీపేమెంట్‌పై వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ కేసులను నివేదించారు. కొన్ని పర్సనల్ లోన్ యాప్‌ల దోపిడీ వల్ల వినియోగదారులకు హాని కలుగుతుందని భావించి వాటిపై నిఘా పెట్టినట్టు మిత్రా పేర్కొన్నారు. RBI క్రమబద్ధీకరించని రుణ కార్యకలాపాలను (BULA) నిషేధించడానికి ఒక చట్టాన్ని సిఫార్సు చేసింది. ఆ తర్వాత Google ఆయా రుణ యాప్‌లను గుర్తించింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రభుత్వ సర్టిఫైడ్ యాప్‌లు లేవని మిత్రా తెలిపారు. హానికరంగా కనిపించని లోన్ యాప్‌లు వినియోగదారులకు ముప్పును కలిగిస్తాయని అన్నారు. వ్యక్తిగత రుణాలు ఇచ్చే యాప్‌లు కూడా మంచి యాప్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది క్రెడిట్ అవసరాల కోసం బ్యాడ్‌లోన్ యాప్‌కు డజన్ల కొద్దీ మంచి యాప్‌లు ఆధారపడ్డరాని తెలిపారు.

Read Also : Online Loan Apps Harassment : తీసుకుంది రూ.2వేలు, కట్టింది రూ.15వేలు, అయినా న్యూడ్ ఫొటోలతో వేధింపులు.. లోన్ యాప్స్ దారుణాలు