గూగుల్ నుంచే మెుబైల్ రీఛార్జ్

  • Edited By: veegamteam , February 5, 2020 / 06:34 AM IST
గూగుల్ నుంచే మెుబైల్ రీఛార్జ్

సాధారణంగా మనకి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాం. అలాంటిది తాజాగా గూగుల్  మెుబైల్ రీఛార్జీలను ఈజీగా, వేగవంతం చేసే ప్రయత్నంలో యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మంగళవారం(ఫిబ్రవరి 4, 2020) న గూగుల్ సెర్చ్ లో ‘ప్రీపెయిడ్ మెుబైల్ రీఛార్జ్’ ఫీచర్ ను విడుదల చేసింది. ఇక నుంచి యూజర్లు గూగుల్ సెర్చ్ ద్వారా తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. 

ఈ ఫీచర్ ని ఆండ్రాయిడ్ మెుబైల్ యూజర్ల కోసం మాత్రమే విడుదల చేసినట్లు తెలిపింది. దీని కోసం గూగుల్ సంస్ధ దేశంలోని టెలికాం దిగ్గజాలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, బీఎస్ఎల్ కంపెనీలతో భాగస్వామ్యం అయ్యింది. గూగుల్ సెర్చ్ ప్లాట్ పామ్ లో పలు రకాల భాషాలలో అందుబాటులో ఉండగా, రీఛార్జ్ ఫీచర్ వాడకాన్ని ఇంగ్లీష్ భాషకు మాత్రం పరిమితం చేసింది.

యూజర్లు గూగుల్ సెర్చ్ లో  ప్రీపెయిడ్ మెుబైల్ రీచార్జ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఈ సెర్చ్ క్రమంలో వచ్చే ఆప్షన్ లలో మెుబైల్ నెంబర్, ఆపరేటర్, ప్లాన్ వివరాలను ఎంటర్ చేసి, నేరుగా మెుబైల్స్ కి రీఛార్జ్ చేసుకోవచ్చు. దీని కోసం గూగుల్  Paytm, Mobikwik, Google Pay వంటి ఇతర పేమెంట్ ఆప్షన్లను యూజర్లుకు అందిస్తున్నట్లు తెలిపింది.