డెవలపర్లకు గుడ్ న్యూస్: గూగుల్ కొత్త వెబ్ డొమైన్ వచ్చేసింది

మీరు వెబ్ డెవలపర్స్ అయితే.. మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త వెబ్ డొమైన్ బ్రాండ్ ను రిలీజ్ చేసింది. డెవలపర్ల కోసం ఈ కొత్త టాప్ లెవల్ డొమైన్ (TLD)ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.

  • Published By: sreehari ,Published On : February 20, 2019 / 11:40 AM IST
డెవలపర్లకు గుడ్ న్యూస్: గూగుల్ కొత్త వెబ్ డొమైన్ వచ్చేసింది

మీరు వెబ్ డెవలపర్స్ అయితే.. మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త వెబ్ డొమైన్ బ్రాండ్ ను రిలీజ్ చేసింది. డెవలపర్ల కోసం ఈ కొత్త టాప్ లెవల్ డొమైన్ (TLD)ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.

మీరు వెబ్ డెవలపర్స్ అయితే.. మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త వెబ్ డొమైన్ బ్రాండ్ ను రిలీజ్ చేసింది. డెవలపర్ల కోసం ఈ కొత్త టాప్ లెవల్ డొమైన్ (TLD)ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. కొత్త టెక్నాలజీను నేర్చుకోవడమే కాకుండా కొత్త డొమైన్ నేమ్ తో ప్రాజెక్టులను ఈ వెబ్ డొమైన్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి .dev డొమైన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రొగ్రామ్ లో భాగంగా డెవలపర్లు .dev domainsను రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. దీనిద్వారా మీకు కావాల్సిన డొమైన్లకు సెక్యూరిటీ ఇవ్వొచ్చు. ఇందుకు అదనంగా ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి .dev డొమైన్లు బేస్ యానివల్ ఫ్రైస్ కే పొందొచ్చునని వైస్ ప్రెసిడెంట్ గూగుల్ బెన్ ఫ్రైడ్ బ్లాగ్ పోస్టులో తెలిపారు. 
 

ఇప్పటికే ఈ .dev డొమైన్లను చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు వినియోగిస్తున్నాయని, అందులో GitHub, Mozilla, Netflix, Glitch, Stripe టెక్ దిగ్గజాలు తమ ప్రాజెక్టుల్లో ఈ డొమైన్లనే ప్రిఫర్ చేస్తున్నాయని తెలిపారు. గూగుల్ కొత్త వెబ్ డొమైన్ తో పాటు తమ సొంత ప్రాజెక్టుల్లో web. Dev, opensource.dev డొమైన్లను కూడా వినియోగిస్తున్నాయని బెన్ ఫైడ్ చెప్పారు. GoDaddy, Namecheap వివిధ పార్టనర్ల ప్లాట్ ఫాంపై కూడా రిజిస్ట్రేషన్ ఓపెన్ .dev డొమైన్లను కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఏడాది ప్రీమియంతో కలిపి 11వేల డాలర్లు ఉంది. రానున్న రోజుల్లో ఈ డొమైన్ ధర తగ్గిపోయే అవకాశం ఉంది. ఎర్లీ యాక్సెస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28న ఉదయం 8 గంటలతో ముగియనుంది.  
 

గూగుల్ అందించే ఈ కొత్త వెబ్ డొమైన్ ద్వారా డెవలపర్లు తమ యూజర్లను ప్రొటెక్ట్ చేయొచ్చు. యాడ్ మాల్ వేర్స్, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్ నుంచి ట్రాకింగ్ ఇంజెక్షన్, ఓపెన్ Wi-Fi సెక్యూరిటీ ఇష్యూలను బై డిఫాల్ట్ గా సెక్యూర్ ఇస్తుంది. న్యూ డొమైన్ సెక్యూర్ చేయాలంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ ఫర్ ప్రొటోకాల్ సెక్యూర్ (HTTPS)ద్వారా .dev websites కు కనెక్ట్ చేయొచ్చు. దీంతో ప్రతి .dev వెబ్ సైట్ లు భవిష్యత్తులో HTTPS ఆధారంగా బ్రౌజర్, వెబ్ సైట్ కు మధ్య సెక్యూర్ కనెక్షన్ తో పనిచేయనున్నాయి. గూగుల్ ఇటీవలే .app, .page డొమైన్ల కూడా ప్రవేశపెట్టింది.  

Read Also : పట్టపగలే లక్షలు లూటీ: ఏటీఎం క్యాష్ వెహిక‌ల్‌పై కాల్పులు
Read Also : మా నాన్న గుర్తుకొచ్చాడు : జవాన్లకు నివాళులర్పిస్తూ రాహుల్ కంటతడి