Google emotional Video: వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ గూగుల్ ఎమోషనల్ వీడియో

యూజర్లను వ్యాక్సినేషన్ కు ఎంకరేజ్ చేసేలా.. దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ వీడియోను రెడీ చేశారు. దాని పేరేంటో తెలుసా.. 'గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్'..

Google emotional Video: వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ గూగుల్ ఎమోషనల్ వీడియో

Get Back To What You Love

Google emotional Video: యూజర్లను వ్యాక్సినేషన్ కు ఎంకరేజ్ చేసేలా.. దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ వీడియోను రెడీ చేశారు. దాని పేరేంటో తెలుసా.. ‘గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్’ (మీరు ప్రేమించిన దానికి మరలండి) అంటూ నిమిషం పాటు నిడివి ఉన్న వీడియోను రెడీ చేసింది.

ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు పూర్తి చేశారు. ఇక్కడిలాగే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అపోహలు ఉన్నాయి.

ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం నుంచి వచ్చినవే అని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై క్లారిటీ కోసం గూగుల్ కొత్త వీడియో రెడీ చేసి రిలీజ్ చేసింది. ఈ ఒక్క నిమిషం పాటు ఉన్న వీడియోలో ప్యాండమిక్ ఇయర్(మహమ్మారితో గడిపిన సంవత్సరం) గురించి గుర్తు చేస్తూ ఉంది. ఇళ్లకే పరిమితం అవ్వాలని నిర్భందించిన వీడియో.. తిరిగి సాధారణ స్థితికి రావాలని అందులో చూపించారు.

గూగుల్ సెర్చి బార్ లో.. క్వారంటైన్, సోషల్ డిస్టెన్సింగ్, స్కూల్ క్లోజింగ్స్, నిబంధనల ఊబిలో కూరుకుపోతారా.. బయటపడాలంటే ఒకటే మార్గం అంతా వ్యాక్సిన్ వేయించుకోండి. అలా చివరికి సెర్చ్ బార్ లో ప్యాండమిక్ ను తొలగించేస్తారు. గూగుల్ రెడీ చేసిన ఈ వీడియోకు యూట్యూబ్ లో భారీ స్పందనే వచ్చింది.