Google Wear OS : గూగుల్ వేర్ ఓఎస్ స్మార్ట్ వాచ్‌లో బ్యాకప్ సపోర్టు.. మీ డేటాను కొత్త డివైజ్‌లోకి ఈజీగా మూవ్ చేయొచ్చు!

Google Wear OS : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Wear OS) స్మార్ట్‌వాచ్ కొత్త సపోర్టుతో వచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో Wear OS డివైజ్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.

Google Wear OS : గూగుల్ వేర్ ఓఎస్ స్మార్ట్ వాచ్‌లో బ్యాకప్ సపోర్టు.. మీ డేటాను కొత్త డివైజ్‌లోకి ఈజీగా మూవ్ చేయొచ్చు!

Google Wear OS May Get Smartwatch Backup Support When Switching to New Device_ Report

Google Wear OS : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Wear OS) స్మార్ట్‌వాచ్ కొత్త సపోర్టుతో వచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో Wear OS డివైజ్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ టెక్ దిగ్గజం Google తమ Play సర్వీసుల్లో యాప్ లేటెస్ట్ APK టియర్‌డౌన్‌లో వెల్లడయ్యాయి. XDA-డెవలపర్ యాప్ టియర్‌డౌన్ ప్రకారం.. Google Play సర్వీసెస్ యాప్ బీటా వెర్షన్ 22.32.12 అందుబాటులో ఉంది. ఈ బిల్డ్‌లోని కొత్త స్ట్రింగ్‌లు కొత్త డివైజ్‌లోకి మారేటప్పుడు స్మార్ట్‌వాచ్ డేటాను బ్యాకప్ చేసేందుకు సపోర్టు చేస్తాయని వెల్లడించింది. దీనికి ఒక పేరు కూడా ఉంది. అదే.. ‘companion_backup_opt_in_title’ దీనిలో ప్రాంప్ట్‌లు ఉన్నాయి.

‘Google Oneతో మీ డివైజ్ బ్యాకప్ చేయండి/ Google One ద్వారా బ్యాకప్ చేయండి/ బ్యాకప్ అకౌంట్ ఎంచుకోండి. ప్రస్తుతం, Wear OS స్మార్ట్‌వాచ్‌ని కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కి మార్చేటప్పుడు యూజర్లు ముందుగా గుర్తుంచుకోవాల్సింది.. స్మార్ట్ వాచ్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. డివైజ్ బ్యాకప్ చేసేందుకు ఒక ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సులభంగా డేటా మూవ్ చేసుకోవచ్చు.

Google Wear OS May Get Smartwatch Backup Support When Switching to New Device_ Report

Google Wear OS May Get Smartwatch Backup Support When Switching to New Device

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. Google One, Payment Google మెంబర్‌షిప్ అందిస్తోంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించేందుకు Google One సభ్యత్వం అవసరం లేదు. అయినప్పటికీ Android, iOS కోసం Google డివైజ్ డేటా బ్యాకప్‌ల సెట్టింగ్స్ Google One యాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. Google One సబ్‌స్క్రైబర్‌లు తమ Google అకౌంట్లో అదనపు స్టోరేజ్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.

Google నివేదిక ప్రకారం.. పేవాల్ వెనుక ఇలాంటి ఫీచర్‌ ఉండదు. ఇటీవల, Google కెమెరా యాప్‌ల కోసం Android, Wear OS రెండింటిలోనూ అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తోంది. Pixel డివైజ్‌ల కోసం Google కెమెరా యాప్ చిన్నపాటి అప్‌డేట్స్ పొందుతుంది. ప్రాథమికంగా Pixel ఓనర్ల కోసం రిమోట్ కంట్రోల్ పనిచేసే Wear OS యాప్, మునుపటి వెర్షన్ నుంచి కొన్ని పెద్ద అప్‌డేట్‌లను ఫుల్ రీడిజైన్‌ను పొందుతుంది. Wear OSలోని కెమెరా యాప్‌ను కొంతకాలంగా అప్‌డేట్ చేయాల్సి ఉంది. గూగుల్ కొత్త పిక్సెల్ స్మార్ట్‌వాచ్‌ను కూడా రాబోయే నెలల్లో రిలీజ్ చేయనుంది.

Read Also : Xiaomi NoteBook Pro : షావోమీ నోట్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ , 4K స్మార్ట్ టీవీ X సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 30నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?