wifinanscan : ఇంటర్నెట్ లేకుండా లార్జ్ డేటా షేర్ చేయాలా? అయితే ఇది మీ కోసమే!

గూగుల్ ప్లే స్టోర్‌లో డెవలపర్‌ల కోసం wifinanscan అనే యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఇతర పరికరాలతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది, అంతేకాదు ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చాలా పనులు చేయవచ్చు.

wifinanscan : ఇంటర్నెట్ లేకుండా లార్జ్ డేటా షేర్ చేయాలా? అయితే ఇది మీ కోసమే!

Google Wifinanscan App Uses Google Releases Wifinanscan App For Developers

wifinanscan : గూగుల్ ప్లే స్టోర్‌లో డెవలపర్‌ల కోసం wifinanscan అనే యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఇతర పరికరాలతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది, అంతేకాదు ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చాలా పనులు చేయవచ్చు. ఈ Wi-Fi అవేర్ ప్రోటోకాల్ ఉపయోగించి రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఖచ్చితమైన దూరాన్ని కూడా కొలవచ్చు.

wifinanscan యాప్ ను ప్రత్యేకంగా డెవలపర్లు, విక్రేతలు మరియు విశ్వవిద్యాలయాల కోసం టెస్టింగ్ సాధనంగా రూపొందించారు. ఈ యాప్ తో, ఒకటి నుండి 15 మీటర్ల వరకు ఉన్న పరికరాల మధ్య దూరాన్ని ఖచ్చితత్వంతో కొలవవచ్చు. డెవలపర్లు పీర్-టు-పీర్ రేంజ్, డేటా బదిలీతో వైఫై అవేర్ / NAN API ల ఆధారంగా రెండు ఫోన్ల మధ్య దూరం లేదా పరిధిని కొలవడానికి ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు.

వై-ఫై అవేర్ నెట్‌వర్క్ కనెక్షన్ బ్లూటూత్‌తో పోలిస్తే ఎక్కువ రేంజ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఫోటో-షేరింగ్ తోపాటు వినియోగదారుల మధ్య పెద్ద మొత్తంలో డేటాను పంచుకునేందుకు ఈ రకమైన కనెక్షన్లు ఉపయోగపడతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా లార్జ్ డేటా షేరింగ్ కోసం డెవలపర్లు ఈ యాప్ ను ఆశ్రయించవచ్చు.