Google Digital Vaccine Cards : ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈజీగా మీ వ్యాక్సిన్ రికార్డులు దాచుకోవచ్చు!

ప్రపంచ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అల్ఫాబెట్ ఇంక్ సంస్థ గూగుల్ తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. గూగుల్ Digital Vaccine Cards ఫీచర్.. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ యూజర్లు ఈజీగా తమ వ్యాక్సిన్ రికార్డులను స్టోర్ చేసుకోవచ్చు.

Google Digital Vaccine Cards : ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈజీగా మీ వ్యాక్సిన్ రికార్డులు దాచుకోవచ్చు!

Google Will Bring Digital Vaccine Cards To Android Phones

Google Digital Vaccine Cards : ప్రపంచ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అల్ఫాబెట్ ఇంక్ సంస్థ గూగుల్ తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. గూగుల్ Digital Vaccine Cards ఫీచర్.. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ యూజర్లు ఈజీగా తమ వ్యాక్సిన్ రికార్డులను స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందట.. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో మాత్రమే ప్రవేశపెట్టింది. కానీ, భారత్, ఇతర దేశాల్లోనూ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

అమెరికాలో పలు కంపెనీలు, రాష్ట్రాలు వ్యాక్సిన్ షాట్లను డిజిటిల్ ఎవిడెన్స్ గా స్టోర్ చేయాలంటూ డిమాండ్ చేశాయి. దాంతో గూగుల్ ఈ కొత్త డిజిటల్ వ్యాక్సిన్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డుల ద్వారా యూజర్లు తమ వ్యాక్సిన్ డేటా లేదా కొవిడ్-19 స్టేటస్‌ను ఫోన్లలోనే స్టోర్ చేసుకోనే వీలుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు కూడా.

ఆరోగ్య సంరక్షణ సంస్థ లేదా ప్రభుత్వం గూగుల్ సిస్టమ్ స్టోర్ చేసిన యూజర్ల వ్యాక్సిన్ ఫలితాలను ఈ కొత్త టూల్స్ ద్వారా డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఈ ఫీచర్ అమెరికాలో ప్రారంభమైనప్పటికీ ఇతర ఏ దేశాల్లో అందుబాటులోకి రానుందో వెల్లడించలేదు. కాలిఫోర్నియా తమ స్వంత వ్యవస్థ ద్వారా డిజిటల్ కార్డులను యాక్సస్ చేసిన రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మహమ్మారి సమయంలో గూగుల్ ఆపిల్ ఇంక్. మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి కరోనా డిసీజ్ ట్రాకింగ్ ప్రారంభించాయి.