Gmail Account : మీ జీమెయిల్ అకౌంట్ ఇలా ఉంటే.. గూగుల్ డిలీట్ చేస్తుంది జాగ్రత్త.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Gmail Account : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ఎంతకాలంగా మీ జీమెయిల్ వాడుతున్నారో వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే.. త్వరలో మీ Gmail అకౌంట్ డిలీట్ కావొచ్చు.. ఎందుకో తెలుసా?

Gmail Account : మీ జీమెయిల్ అకౌంట్ ఇలా ఉంటే.. గూగుల్ డిలీట్ చేస్తుంది జాగ్రత్త.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Google will remove your Gmail account if you have not logged in 2 years

Gmail Account will Remove Soon : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ఎంతకాలంగా జీమెయిల్ వాడుతున్నారు? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ జీమెయిల్ అకౌంట్ ఏ క్షణంలోనైనా డిలీట్ కావొచ్చు.. చాలామందికి జీమెయిల్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే, అవసరం ఉన్న లేకున్నా జీమెయిల్ అకౌంట్లు ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. కానీ, ఆ జీమెయిల్ అకౌంట్లను ఒకసారి కూడా ఓపెన్ చేయరు. తరచూ జీమెయిల్ అకౌంట్లను ఓపెన్ చేస్తుంటే.. అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుందని గూగుల్ భావిస్తుంది. ఒకవేళ మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి వదిలేస్తే మాత్రం.. గూగుల్ ఆయా అకౌంట్లను డిలీట్ చేసే అవకాశం ఉంది. జీమెయిల్ అకౌంట్ ఉండి కూడా.. రెండేళ్లకు పైగా ఉపయోగించకుంటే మాత్రం అలాంటి ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ త్వరలో డిలీట్ చేయనుంది.

ఇన్‌యాక్టివ్ అకౌంట్ల కోసం గూగుల్ కొత్త విధానాలకు అప్‌డేట్‌ను ప్రకటించింది. ప్రతి 24 నెలలకు ఒకసారి లాగిన్ అవ్వాలని, పాత గూగుల్ అకౌంట్లను సమీక్షించాలని కంపెనీ వినియోగదారులను కోరింది. ఇంతకుముందు, గూగుల్ రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేయని అకౌంట్లలో స్టోర్ అయిన డేటా డిలీట్ అయ్యేలా ఒక విధానాన్ని కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని పూర్తిగా గూగుల్ తమ సర్వర్ల నుంచి డిలీట్ చేయనుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గూగుల్ అకౌంట్ల కోసం ఇన్‌యాక్టివ్ విధానాన్ని మరో 2 ఏళ్లకు అప్‌డేట్ చేస్తున్నామని పేర్కొంది.

Read Also : Gmail Storage Full : మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయిందా? కొత్త మెయిల్స్ రావడం లేదా? ఇలా సెకన్లలో స్టోరేజీని క్లీన్ చేయొచ్చు..!

రెండేళ్లకు పైగా ఉపయోగించని అకౌంట్లపై ఎఫెక్ట్.. :
ఈ ఏడాది చివరి నుంచి గూగుల్ అకౌంట్లను కనీసం 2 సంవత్సరాలుగా ఉపయోగించకుంటే లేదా సైన్ ఇన్ చేయకుంటే.. Google Workspace (Gmail, Docs, Drive, Meet, Calender), YouTube, గూగుల్ ఫొటోలు (Google Photos) వంటి కంటెంట్‌తో సహా అన్ని అకౌంట్లలో కంటెంట్‌లను డిలీట్ చేయొచ్చనని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ కొత్త విధానం ఈ ఏడాది డిసెంబరు వరకు అమలులో ఉండదు. జీమెయిల్ యాక్టివ్‌గా లేని యూజర్‌లు తమ పాత అకౌంట్ తిరిగి పొందేందుకు ఇంకా సమయం ఉంది. జీమెయిల్ యూజర్లు తమ పాత లాగిన్ డేటాను తిరిగి పొందాలన్నా లేదా ఈ తొలగింపు ప్రక్రియ ఎలా పని చేస్తుందో తెలియన్నా మరికొద్దికాలం ఆగాల్సిందే.. ముఖ్యంగా, తొలగించిన జీమెయిల్ అకౌంట్లు అందుబాటులో ఉండవని గమనించాలి.

Google will remove your Gmail account if you have not logged in 2 years

Google will remove your Gmail account if you have not logged in 2 years

ఇమెయిల్‌లను చూడటం లేదా పంపడం, గూగుల్ డిస్క్‌ని ఉపయోగించడం, YouTube వీడియోలను చూడటం, Google Play స్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, సెర్చ్ చేయడం లేదా థర్డ్ పార్టీ యాప్‌లు లేదా సర్వీసుల కోసం గూగుల్‌తో సైన్ ఇన్ చేయడం వంటి వివిధ చర్యల ఆధారంగా గూగుల్ అకౌంట్ కార్యాచరణను నిర్ధారిస్తుంది. అయితే, ఇమెయిల్‌లను ఫార్వార్డ్ చేసే మారుపేర్లను సెటప్ చేయడం వంటి నిర్దిష్ట అకౌంట్లను గూగుల్ తొలగిస్తుందా? అనేది అస్పష్టంగానే ఉంది. (Google One) వంటి సర్వీసులకు సబ్‌స్క్రిప్షన్‌ కలిగి ఉండటం కూడా జీమెయిల్ యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నారని చూపించడానికి ఒక మార్గమని గూగుల్ పేర్కొంది, అయితే, సాధారణంగా ప్రత్యామ్నాయ అకౌంట్లకు మాత్రం వర్తించదు.

కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత గూగుల్ క్రియేట్ చేసిన అకౌంట్లు లక్ష్యంగా ప్రారంభమవుతుంది. ఖాతాకు మల్టీ నోటిఫికేషన్‌లు, ఏదైనా అనుబంధిత రికవరీ ఇమెయిల్‌ను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. మొత్తంమీద, వినియోగదారులు ఈ విధాన మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇన్‌యాక్టివ్ గూగుల్ అకౌంట్లు తొలగించకుండా నిరోధించకుండా చర్య తీసుకోవడం చాలా అవసరమన్నారు. పాత అకౌంట్లను చెక్ చేయడంతో పాటు వివిధ చర్యల ద్వారా అకౌంట్ల కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా వారి అకౌంట్ల తొలగింపుకు గురికాకుండా చూసుకోవచ్చు.

Read Also : Twitter CEO Elon Musk : పొరపాటు మాదే.. కొంతమంది ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు సరైనది కాదు.. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాం..!